ఇద్దరు పెద్ద హీరోలతో మల్టీస్టారర్ చేయాలంటే అంత సులువైన విషయం కాదు. వాళ్ల ఇమేజ్‌లు ఏమాత్రం దెబ్బ తినకుండా.. ప్రాధాన్య పరంగా ఒకరికి ఎక్కువ, ఇంకొకరికి తక్కువ అనిపించకుండా.. సమానమైన ఎలివేషన్లు ఉండేలా.. అభిమానుల మనోభావాలు దెబ్బ తినకుండా సినిమా తీయాలి. ఈ విషయంలో రాజమౌళి బాగానే సమతూకం పాటించినట్లున్నాడు ఆర్ఆర్ఆర్ మూవీలో.
ఐతే సినిమా వరకు మాత్రమే కాకుండా.. బయట కూడా ఇద్దరికీ సమానమైన ఎలివేషన్ ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాడు జక్కన్న. ఆర్ఆర్ఆర్ జనవరి 7కు షెడ్యూల్ అయినపుడు.. ముందు నెల పాటు చిత్ర బృందం ప్రమోషన్లతో హోరెత్తించడం తెలిసిందే. ఇందులో భాగంగా ముంబయిలో ఒక భారీ ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లోకి వచ్చింది. ఆ సందర్భంగా నటన, ఆలోచనల పరంగా తారక్, చరణ్‌ల మధ్య తేడా గురించి జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చరణ్, తారక్ మధ్య తేడా ఏంటని అందరూ తనను అడుగుతుంటారని.. వీరిలో ఒక ముఖ్యమైన వైరుధ్యం ఉందని జక్కన్న చెప్పుకొచ్చాడు. ఆర్ఆర్ఆర్‌కు సంబంధించి ఒక సన్నివేశంలో రామ్ చరణ్ అద్భుతంగా చేశాడని.. తాను మానిటర్‌లో ఆ సీన్ చూసి ఆశ్చర్యపోయానని, టేక్ పూర్తి చేసుకుని వస్తున్న చరణ్‌కు ఎదురెళ్లి అతణ్ని హత్తుకుని అద్భుతంగా చేశావని చెప్పానని.. ఐతే అతనేమీ ఎగ్జైట్ కాకుండా మళ్లీ మానిటర్‌లో ఆ సీన్ చూసి బాగానే చేశానా.. ఓకేనా అన్నాడని.. మీకు నచ్చితే ఓకే అన్నాడని.. చరణ్ మంచి నటుడైనప్పటికీ తన నటన మీద తనకు నమ్మకం ఉండదని జక్కన్న వివరించాడు.
ఇక తారక్ విషయానికి వస్తే అతను కూడా అద్భుత నటుడని, ఒక సీన్లో ఇరగదీశాక తాను బాగా చేశావని చెప్పబోతుంటే.. ముందే తన వైపు చూసి ఇరగ్గొట్టేశాను కదా అన్నాడని.. ఇది తారక్‌లో ఉండే కాన్ఫిడెన్స్ అని చెబుతూ తన హీరోలిద్దరి మధ్య తేడాను వివరించాడు జక్కన్న.
This post was last modified on February 8, 2022 9:48 am
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…