Movie News

మోడీ వ‌స్తే వెళ్ల‌లేదు.. ఇప్పుడు కేసీఆర్ పిలుస్తారా?

రాజ‌కీయాల్లో ప‌రిస్థితులు ఇట్టే మారిపోతుంటాయి. ఒక్కోసారి విచిత్ర‌మైన ప‌రిణామాలు ఎదుర‌వుతుంటాయి. ప‌రిస్థితులు ప్ర‌భావం దృష్ట్యా కొన్ని సార్లు త‌గ్గాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా అలాంటి పరిస్థితే ఎదుర‌య్యేలా ఉంది. కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్‌పై పోరుబావుటా ఎగ‌రేసిన కేసీఆర్‌.. మోడీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లలేదు. ఇక్రిసాట్ స్వ‌రోత్స‌వ సంబ‌రాలు, రామానూజాచార్యుల విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ కోసం మోడీ హైద‌రాబాద్ వ‌స్తే కేసీఆర్ జ్వ‌రం పేరుతో వెళ్లకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్‌.. మోడీని రాష్ట్రానికి ఆహ్వానించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

రాష్ట్రంలోని యాదాద్రిని కేసీఆర్ ప్ర‌భుత్వం గొప్ప‌గా తీర్చిదిద్దుతోంది. ఈ ఆల‌య పునఃప్రారంభం వ‌చ్చే నెల‌లోనే జ‌రుగుతుంది. ఆ ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ కోసం కేసీఆర్ ఈ రోజు అక్క‌డికి వెళ్లారు. పునఃప్రారంభం కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా చేప‌ట్టే మహాకుంభ సంప్రోక్ష‌ణ కోసం నిర్వ‌హించే సుద‌ర్శ‌న యాగం ఇత‌ర ఏర్పాట్ల‌పై ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హిస్తారు. మార్చి 28న మ‌హా కుంభ సంప్రోక్ష‌ణ నిర్వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కార్య‌క్ర‌మానికి గ‌తంలో ప్ర‌ధాని మోడీని కేసీఆర్ ఆహ్వానించారు. ఢిల్లీ వెళ్లి క‌లిసిన‌ప్పుడు యాదాద్రి పునః ప్రారంభానికి రావాల‌ని కేసీఆర్ ఆహ్వానించగా.. మోడీ కూడా సానుకూలంగా స్పందించారు.

కానీ ఇప్పుడు రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులు మారాయి. మోడీ అంటేనే కేసీఆర్ ఒంటికాలిపై లేస్తున్నారు. ప్ర‌ధానిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అలాంటిది అధికారికంగా ప్ర‌ధానిని ఆయ‌న ఆహ్వానిస్తారా? అన్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఒక‌వేళ ఆహ్వానించిన మోడీ వ‌స్తారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇప్ప‌టికే ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్ పాల్గొనాల్సింద‌ని కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలాంటిది ఇప్పుడు మోడీని యాదాద్రికి కేసీఆర్ ఆహ్వానించ‌కుంటే ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా మారుతుంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌న్న ఆస‌క్తి కలుగుతోంది. ఒక‌వేళ మోడీ యాదాద్రికి వ‌స్తే మాత్రం అప్పుడు కేసీఆర్ ఎలాగో ఆయ‌న వెంట ఉండాల్సందే క‌దా అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. 

This post was last modified on February 8, 2022 9:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దు లేదు.. ఆ వార్త‌లు న‌మ్మొద్దు: ఏపీ ప్ర‌భుత్వం

ఏపీలో కీల‌క‌మైన ఇంట‌ర్మీడియెట్ తొలి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు ర‌ద్దు చేశార‌ని, రెండేళ్లుక‌లిపి ఒకేసారి నిర్వ‌హిస్తున్నార‌ని పేర్కొం టూ.. బుధ‌వారం మ‌ధ్యాహ్నం…

5 hours ago

తిరుప‌తి క్యూలైన్లో తోపులాట‌.. ఎంత మంది చనిపోయారు

ఈ నెల 10 శుక్ర‌వారం నాడు వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌త్యేక స‌ర్వ‌ద‌ర్శ‌న టోకెన్ల పంపిణీని…

7 hours ago

న‌మో-న‌మో-న‌మో.. నారా లోకేష్ 21 సార్లు!

ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ త‌న ప్ర‌సంగంలో ఏకంగా 21 సార్లు న‌మో అనే ప‌దాన్ని…

7 hours ago

మోదీ, పవన్ పై చంద్రబాబు ప్రశంసలు

విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…

7 hours ago

తెలుగులో మోదీ స్పీచ్ కు ఫిదా!

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…

8 hours ago

ఏపీకి ప్ర‌ధాని ఇచ్చిన వ‌రాల ప్రాజ‌క్టులు ఇవీ..

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌లు గంటున్న ల‌క్ష్యాల‌ను సాకారం చేసేందుకు తాము అండ‌గా ఉంటామ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ…

8 hours ago