‘లైగర్’ డిజిటల్ రైట్స్.. ఫ్యాన్సీ రేటు!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘లైగర్’. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. దానికి తగ్గట్లే సినిమాకి క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.
తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ.60 కోట్లు చెల్లిస్తామని డీల్ ఆఫర్ చేసిందట. అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు తమకే ఇచ్చే విధంగా అమెజాన్ డీల్ మాట్లాడింది. విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరో సినిమాకి ఈ రేంజ్ లో ఆఫర్ రావడం మామూలు విషయం కాదు.
మంచి రేటు కావడంతో నిర్మాతలు కూడా డిజిటల్ హక్కులను అమ్మేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించనున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఆగస్టు 25న విడుదల చేస్తామని మేకర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మిలతో కలిసి కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఆయన కాంబినేషన్ సీన్స్ ను తెరకెక్కించడానికి చిత్రబృందం అమెరికాకు వెళ్లింది.
ఈ సినిమా తరువాత విజయ్ తన తదుపరి సినిమా కూడా పూరి జగన్నాధ్ దర్శకత్వంలోనే చేయనున్నారు. మహేష్ బాబుతో చేయాలనుకున్న ‘జనగణమన’ ప్రాజెక్ట్ ను విజయ్ తో చేయబోతున్నారు. రీసెంట్ గా దీనిపై హింట్ కూడా ఇచ్చారు పూరి జగన్నాధ్. ఈ సినిమాలో కూడా కరణ్ జోహార్ భాగస్వామ్యం ఉంటుందని తెలుస్తోంది.