రొమాంటిక్ హీరోగా నాగార్జునకి ఉన్న ఇమేజే వేరు. అలాంటిది ఇప్పుడు ఆయనతో రొమాన్స్ చేయడానికి హీరోయిన్లను పట్టుకోవడం కష్టమవుతోంది. ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నప్పటికీ సీనియర్ హీరో కావడంతో ఆయనకు సూటయ్యే జోడీని వెతకడం దర్శక నిర్మాతలకు కాస్త కష్టంగానే ఉంది. ఆ సమస్య ‘ద ఘోస్ట్’ చిత్రాన్ని కూడా వెంటాడుతోంది.
ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించాల్సి ఉంది. కొన్నాళ్లు షూట్‌లో కూడా పాల్గొంది. అంతలో కన్సీవ్ అవ్వడంతో ఇక యాక్ట్ చేయలేనని చెప్పింది. యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ కావడం, స్టంట్స్ అవీ చేయాల్సి రావడంతో రిస్క్ తీసుకోకూడదని ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా తప్పుకుంది. అప్పట్నుంచి హీరోయిన్ వేట కొనసాగుతూనే ఉంది.
ఏవో తంటాలు పడి అమలాపాల్‌ని ఫిక్స్ చేస్తే.. ఆమె కూడా వాకౌట్ చేసేసింది. తను అడిగినంత ఇవ్వడానికి నిర్మాత ఒప్పుకోకపోవడమే దానికి కారణమని టాక్. ఏదైతేనేం.. మళ్లీ హీరోయిన్ కోసం సెర్చింగ్ స్టార్ట్ అయ్యింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓకే అనుకున్నారు కానీ ఆమె ఓ కేసులో ఇరుక్కోవడంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది. ఎట్టకేలకి సోనాల్ చౌహాన్ దగ్గర వేట ఆగింది.
బాలయ్య లాంటి స్టార్‌తో రెండు హిట్ సినిమాల్లో నటించిన సోనాల్.. ప్రస్తుతం వెంకటేష్ ‘ఎఫ్3’లో యాక్ట్ చేస్తోంది. నాగార్జునకి కూడా మంచి పెయిర్ అవుతుందనే ఉద్దేశంతో ఆమెనే ఫైనల్ చేశారట. ఈ నెల 12 నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఇందులో నాగ్‌తో పాటు సోనాల్ కూడా జాయినవనున్నట్లు తెలిసింది. కొంత పార్ట్ విదేశాల్లోనూ తీయాల్సి ఉంది. కానీ కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఆ షెడ్యూల్‌ని వాయిదా వేస్తూ వస్తున్నారట.
This post was last modified on February 7, 2022 10:01 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…