పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో రాధేశ్యామ్ ఒకటి. కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్రను పోషించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనేక వాయిదాల అనంతరం మార్చి 11న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసం యంగ్ సెన్సేషన్ తమన్‌ను రంగంలోకి దింపారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. రాధేశ్యామ్‌కు పైసా తీసుకోకుండా తమన్ పని చేస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగానే ఆయనే తెలియజేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్…. రాధేశ్యామ్ గొప్ప ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రం ఎప్పటికీ అందరి మనసుల్లో నిలిచిపోతుందని నాకు అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమా స్థాయికి నేను సరిపోను. అయినా నాపై ఉన్న నమ్మకంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయమని యూవీ క్రియేషన్స్ వారు నన్ను అడిగారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే నేను భావిస్తున్నాను
ఇంకా మాట్లాడుతూ.. రాధేశ్యామ్ పాన్ ఇండియా చిత్రం అయినప్పటికీ నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎందుకంటే, నా చేతిలో ఏ సినిమా లేక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు యూవీ క్రియేషన్స్ మహానుభావుడు, భాగమతి అవకాశాలు ఇచ్చింది. అందుకే వారి రుణం ఇలా తీర్చుకున్నా అంటూ తమన్ పేర్కొన్నారు. ఏదేమైనా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న తమన్ ఓ పాన్ ఇండియా చిత్రానికి రెమ్యునరేషన్ తీసుకోకుండా పని చేయడం నిజంగా గ్రేటనే చెప్పాలి.
This post was last modified on February 7, 2022 2:18 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…