2022 తర్వాత సినిమాలు చేయను, రిటైరవుతున్నా అంటూ ట్విట్టర్లో స్టేట్మెంట్ ఇచ్చి తన ఫాలోవర్లు సహా అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ. శుక్రవారం అర్ధరాత్రి పెట్టిన అతడి ట్వీట్ ఉదయానికల్లా వైరల్ అయిపోయింది. పెద్ద పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ కెరీర్ మంచి ఊపుమీదుండగా.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటి అంటూ అందరూ దీని గురించి తెగ చర్చించుకున్నారు. ఇండస్ట్రీలో సైతం దీని గురించి కొంత డిస్కషన్ నడిచినట్లు సమాచారం.
ఐతే అందరూ సీరియస్‌గా తీసుకున్న విషయాన్ని జోక్ అని చెప్పి నివ్వెరపరిచాడు రాహుల్. తాను చెప్పింది నమ్మిన వాళ్లందరినీ ఫూల్స్ అని పేర్కొంటూ అతను కొత్తగా ఒక ట్వీట్ వేశాడు. మంచి పారితోషకం అందుకుంటూ లగ్జరీ జీవితాన్ని గడుపుతూ, ఎన్నో ప్రయోజనాలు పొందుతున్న తాను.. ఇవన్నీ ఎందుకు వదులుకుంటానని అతను ప్రశ్నించాడు.
తన స్నేహితులు కూడా ఫోన్ చేసి రిటైరవుతున్నందుకు శుభాకాంక్షలు చెప్పడాన్ని తాను నమ్మలేకపోతున్నానని రాహుల్ అన్నాడు. ఐతే రాహుల్ సీరియస్‌గా ట్వీట్ వేసి ఇప్పుడు జోక్ అనడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ లాంటి మంచి కమెడియన్ సినిమాలు మానేయడమేంటి అని ఆందోళన వ్యక్తం చేస్తే.. మీరంతా ఫూల్స్ అయ్యారంటూ కామెడీ చేయడమేంటి అంటూ మండిపడుతున్నారు.
ఇంతకుముందు నెట్ సినిమా విషయంలో రాహుల్ ఎంత హంగామా చేశాడో అందరికీ గుర్తుండే ఉంటుంది. దాన్ని మించిన సినిమా లేదంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాడు. తీరా చూస్తే అదొక నాసిరకం సినిమా అని తేలడంతో అతడిపై నెటిజన్లు మండిపడ్డారు. ఇప్పుడు తన కెరీర్ విషయంలో జోక్ వేసి తన క్రెడిబిలిటీని మరింత దెబ్బ తీసుకున్నాడు రాహుల్.
This post was last modified on February 6, 2022 9:10 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…