తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్-సావిత్రిల జంట ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ‘మిస్సమ్మ’, ‘గుండమ్మ కథ’ లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాల్లో జంటగా నటించి మెప్పించారు. వెండితెరపై వీరి కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పండింది. అలాంటి వీరిద్దరూ ‘రక్తసంబంధం’ సినిమాలో మాత్రం అన్నాచెల్లెళ్లుగా కనిపించారు. ఈ సినిమాలో వీరిద్దరి ఎమోషనల్ పెర్ఫార్మన్స్ కళ్లు చెమ్మగిల్లేలా చేస్తుంది.
అటు జంటగా కనిపించి మెప్పించడంతో పాటు.. ఇటు అన్నాచెల్లెళ్లుగా నటించి ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు అలాంటి ఓ రేర్ ఫీట్ ను రిపీట్ చేయబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో తనకు జంటగా నటించిన నయనతారను తన కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’లో సిస్టర్ రోల్ కోసం తీసుకున్నారు చిరు.
కథను బట్టి సినిమాలో వీరిద్దరి మధ్య పెద్దగా అనుబంధం ఉండదు. చిరుని అపార్ధం చేసుకొని.. అతడిని దూరం పెడుతుంటుంది నయన్. ఫైనల్ గా చెల్లెలు కష్టంలో ఉందని తెలుసుకొని ఆమెని కాపాడే సీన్ లో హీరో కనిపిస్తాడు. ఈ సన్నివేశాలన్నీ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. మరి ఇలాంటి కథలో చిరు-నయన్.. అప్పట్లో ఎన్టీఆర్-సావిత్రి క్రియేట్ చేసిన రేర్ ఫీట్ ను రిపీట్ చేస్తారేమో చూడాలి!
ప్రస్తుతం నయనతార ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చింది. నయన్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే వారం నుంచి చిరంజీవి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనున్నారు. నయనతారతో కాంబినేషన్ సీన్స్ లో చిరు నటిస్తారని సమాచారం. మలయాళంలో తెరకెక్కిన ‘లూసిఫర్’ సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
This post was last modified on February 5, 2022 3:45 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…