యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్`ను పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో, ఆపై చిత్రాన్ని ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ రెండిటి తర్వాత `ఉప్పెన`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది.
అయితే తాజాగా ఎన్టీఆర్ లిస్ట్‌లో మరో దర్శకుడు వచ్చి చేరాడు. ఆయనెవరో కాదు పరుశురామ్. ఇప్పుడీయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్నాడు. ఇందులో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం సమ్మర్‌లో మే 12న విడుదల కానుంది.
అయితే ఈ సినిమా తర్వాత పరుశురామ్ ఎన్టీఆర్‌తో ఓ మల్టీస్టారర్ చిత్రం చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ అదిరిపోయే లైన్‌ను కూడా ఎన్టీఆర్‌కి వినిపించగా.. అది ఆయనకు బాగా నచ్చిందట. అంతేకాదు, ఎన్టీఆర్ పరుశురామ్‌కు పూర్తి స్థాయిలో కథ సిద్దం చేయమని కూడా సూచించారట.
ఇక వీరి కాంబోలో తెరకెక్కబోయే మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించబోతోందని టాక్ నడుస్తోంది. మరి ఒకవేళ నిజంగానే ఎన్టీఆర్, పరుశురామ్ కాంబోలో మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ఖరారైతే.. త్వరలోనే ఈ సినిమాపై ప్రకటన వస్తుంది.
This post was last modified on February 5, 2022 2:41 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…