‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. స్టార్ డైరెక్టర్ లేకపోయినా.. ఆయన సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతూ.. వందల కోట్లు కొల్లగొడుతున్నాయి. ‘సాహో’ సినిమాను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. మార్చి 11న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమాను రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేశారు. నిజానికి ఆయన తెలుగులో ఒక్క సినిమా మాత్రమే చేశారు. అలాంటిది ‘రాధేశ్యామ్’ సినిమాకి పాన్ ఇండియా లెవెల్ లో డిమాండ్ పెరిగిందంటే దానికి కారణం ప్రభాస్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క ఇండియాలోనే ఈ సినిమాను 6000 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా పది వేల థియేటర్స్ లో ఈ సినిమా విడుదలవుతుందట. ఈ రేంజ్ లో స్క్రీన్స్ దక్కాయంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్ధమవుతుంది. నాన్ థియేట్రికల్ బిజినెస్ లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ మొత్తం కలుపుకుంటే ‘రాధేశ్యామ్’ రూ.230 కోట్లు రాబట్టింది. హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ తీసుకోగా.. మిగిలిన భాషల శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది.
‘బాహుబలి’ తరువాత మళ్లీ ఆ రేంజ్ రికార్డ్ డీల్ ‘రాధేశ్యామ్’ సినిమాకే వచ్చింది. ఇదంతా కూడా కేవలం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టామినా వలనే సాద్యమైంది. ప్రస్తుతం ఈ హీరో ‘ఆదిపురుష్’, ‘సలార్’ వంటి సినిమాలను లైన్ లో పెట్టాడు. అలానే ‘స్పిరిట్’, ‘ప్రాజెక్ట్ K’ సినిమాల్లో కూడా నటించనున్నారు.
This post was last modified on February 4, 2022 5:38 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…