సినిమా హాళ్లు తెరవకపోవడంతో ఓటీటీ వైపు ఆశగా చూస్తున్నారు నిర్మాతలు. వాళ్లు కూడా మంచి రేట్లకే సినిమాల్ని కొనడానికి ముందుకు రావడంతో, చిన్న సినిమాలు ఓటీటీ వైపుగా టర్న్ తీసుకుంటున్నాయి. అందులో భాగంగా మరో సినిమా ఓటీటీ పంచన చేరింది. అదే… ‘భానుమతి రామకృష్ణ’. నవీచ్ చంద్ర కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.
అల్లు అరవింద్ సారథ్యంలో నడుస్తున్న ‘ఆహా’లో ఈ నెలాఖరు నుంచి ఈ చిత్రాన్ని ప్రదర్శనకు ఉంచుతారు. ఇప్పుడంటే చిన్న సినిమాలు ఓటీటీ వైపు ఆశగా చూస్తున్నాయి గానీ.. ‘భానుమతి… ఓటీటీ కోసమే తీసిన సినిమా. ఓటీటీ అవసరాల్ని, వాటి శైలిని ముందుగానే అర్థం చేసుకుని ఈ సినిమాని నిర్మించారు. ఇప్పుడు ఓటీటీకి అమ్మేశారు. దాదాపు 1.5 కోట్లకు ‘ఆహా’h హక్కుల్ని కొనుగోలు చేసింది.
ఈ సినిమా బడ్జెట్‌తో పోలిస్తే… గిట్టుబాటు అయినట్టే అని టాక్. అందాల రాక్షసి తరవాత నవీన్ చంద్రకు సరైన బ్రేక్ రాలేదు. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి ఏమవుతుందో చూడాలి.
This post was last modified on June 14, 2020 12:16 pm
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…