టాలీవుడ్లో మళ్లీ రిలీజ్ డేట్ల జాతర మొదలైంది. ఒక్క రోజు వ్యవధిలో అరడజనుకు పైగా సినిమాలకు విడుదల తేదీలు ప్రకటించారు. ఇందులో ‘ఆర్ఆర్ఆర్’ సహా భారీ, క్రేజీ సినిమాలున్నాయి. ఇంత పెద్ద సినిమాలకు రిలీజ్ డేట్లు ఇచ్చారంటే అభిమానుల్లో అమితాసక్తి నెలకొనాలి. రిలీజ్ డేట్ల గురించి ఆసక్తిగా చర్చించుకోవాలి. కానీ సోషల్ మీడియాలో జనాల్లో ఏమంత ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు.
పైగా దీని గురించి కామెడీ చేస్తున్నారు. నెగెటివ్ కామెంట్లే పెడుతున్నారు. రిలీజ్ డేట్ల వ్యవహారం ఇలా కామెడీ అయిపోవానికి పరోక్షంగా కరోనానే కారణం. రెండేళ్ల కిందట దేశంలో కరోనా రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి సినిమాల పరిస్థితి అయోమయం అయిపోయింది. ఏ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఎప్పుడు, ఎలా రిలీజవుతుందో తెలియదు. థియేటర్లు ఎప్పుడు మూత పడుతాయో.. ఎప్పుడు తెరుచుకుంటాయో.. ఎప్పుడు ఆంక్షలుంటాయో అన్న సందిగ్ధత మధ్య సినిమాల పరిస్థితి గందరగోళంగా తయారైంది.
సినిమాలను వాయిదా వేయడం.. కొత్త డేట్ ఇవ్వడం.. మళ్లీ డేట్ మార్చడం.. ఇదంతా మామూలు వ్యవహారం అయిపోయింది. ఇప్పుడు రిలీజ్ డేట్లు ప్రకటించిన ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, ఆచార్య, ఎఫ్-3, గని చిత్రాల్లో ప్రతిదీ కనీసం రెండుసార్లు డేట్ మార్చుకున్నదే. అందుకే ఇప్పుడు కొత్తగా డేట్లు ఇస్తుంటే జనాల్లో సీరియస్‌నెస్ కనిపించడం లేదు. బుకింగ్స్ ఓపెన్ అయ్యాక కూడా సినిమాలు వాయిదా పడిపోతున్న రోజులివి.
అందుకే వచ్చినపుడు చూసుకుందాం.. అప్పటిదాకా వేచి చూద్దాం అన్నట్లు జనాలు ఉంటున్నారు. ఈ వ్యవహారం మరింత కామెడీ అయిపోవడానికి మరో కారణం.. ఒక సినిమాకు ఒక డేట్ కాకుండా ఇది కాకుంటే అది అంటూ ఆప్షన్లు ఇస్తుండటం. ‘ఆర్ఆర్ఆర్’కు ఇంతకుముందు మార్చి 18 లేదా ఏప్రల్ 28 అన్నారు. చివరికి చూస్తే మార్చి 25కు ఫిక్సయ్యారు. ఇప్పుడు భీమ్లా నాయక్, ఆచార్య, గని చిత్రాలకు ఇలాగే ఆప్షన్లు ఇచ్చారు. ఈ విషయంలో నిర్మాతలను తప్పుబట్టడానికి కూడా లేదు. కొవిడ్ పరిస్థితుల్లో ఏదీ వాళ్ల చేతుల్లో ఉండట్లేదు మరి.
This post was last modified on February 1, 2022 6:15 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…