అల్లు అర్జున్, సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా థియేట్రికల్ రన్ ఎప్పుడో అయిపోయిందనే అనుకుంటున్నారు అంతా. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మూడు వారాల కిందటే అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైపోయింది. దీంతో ఈ భాషలన్నింట్లో దాని థియేట్రికల్ రన్ ముగిసిన మాట వాస్తవం. సంక్రాంతి టైంలో హిందీ వెర్షన్ కూడా ప్రైమ్‌లో రిలీజైపోవడంతో ఆ భాషలో వసూళ్లకు తెరపడినట్లే అనుకున్నారు.
కానీ ప్రైమ్‌లో రిలీజయ్యాక కూడా ‘పుష్ఫ’ థియేటర్లలో సత్తా చాటడం విశేషం. అంతకుముందులా కాకపోయినా ఓ మోస్తరుగా వసూళ్లు కొనసాగాయి. నార్త్ ఇండియాలో రూరల్ ఏరియాల్లో ఈ సినిమా వసూళ్లు కొనసాగాయి. ప్రైమ్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ థియేటర్లలో ఈ సినిమాను చూడ్డానికి ఆసక్తి ప్రదర్శించారు అక్కడి ప్రేక్షకులు. దీంతో తర్వాతి రెండు వారాల్లోనూ ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే వసూళ్లు వచ్చాయి.
ఇప్పుడీ చిత్రం హిందీలో రూ.100 కోట్ల నెట్ వసూళ్ల మార్కును అందుకోవడం విశేషం. ప్రైమ్‌లో రిలీజవ్వడానికి ముందు ‘పుష్ప’ హిందీ వెర్షన్ వసూళ్లు రూ.86-87 కోట్ల మధ్య ఉన్నాయి. కాబట్టి 90 కోట్ల వద్ద రన్ ముగుస్తుందని అనుకున్నారు. కానీ గత రెండు వారాల్లో ఓ మోస్తరు వసూళ్లతో నడిచిన సినిమా ఎట్టకేలకు రూ.100 కోట్ల మార్కును టచ్ చేసింది. ప్రైమ్‌లో అందుబాటులో ఉన్నా కూడా ఇలా కలెక్షన్లు రాబట్టి వంద కోట్ల మార్కును అందుకోవడం గొప్ప విషయమే.
‘పుష్ప’ నార్త్ ఇండియాలో ఏ స్థాయిలో సంచలనం రేపిందో చెప్పడానికి ఇది రుజువు. ఈ సినిమాను హిందీ మార్కెట్లో రిలీజ్ చేసిన గోల్డ్ మైన్ ఫిలిమ్స్ వారికి నిజంగా గోల్డ్ మైన్ దొరికినట్లే అయింది. కేవలం పది కోట్లకే ఈ సినిమా హిందీ హక్కులను సొంతం చేసుకుందా సంస్థ. ‘పుష్ప’ నిర్మాతలకు ఇది కొంత బాధ కలిగించే విషయమే అయినా.. ‘పుష్ప-2’ బిజినెస్‌కు మాత్రం ఇది బాగా కలిసొచ్చేదే. సెకండ్ పార్ట్ హిందీ వరకే రూ.100 కోట్లు పలికినా ఆశ్చర్యం లేదేమో.
This post was last modified on January 31, 2022 9:55 pm
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…