కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నా.. వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఏమీ ఉండట్లేదు. పరిస్థితి విషమించి, ప్రాణాలు పోతున్న కేసులు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ను అందరూ లైట్ తీసుకునే పరిస్థితి వచ్చేసింది. అన్ని వ్యాపారాలు యధావిధిగా నడుస్తున్న నేపథ్యంలో సినిమాల ప్రదర్శన విషయంలోనూ ధైర్యం వస్తోంది. ప్రస్తుతానికి బాక్సాఫీస్ డల్లుగా ఉన్నప్పటికీ.. ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండదని అంచనా వేస్తున్నారు.
ఫిబ్రవరిలో పేరున్న సినిమాల విడుదలకు చురుగ్గా సన్నాహాలు జరుగుతుండటం.. ఒకదాని తర్వాత ఒక సినిమాకు రిలీజ్ డేట్ ఇస్తుండటం గమనార్హం. ఫిబ్రవరి 11 నుంచి వాయిదా పడుతుందనుకున్న ఖిలాడి మూవీని అదే తేదీకి రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేస్తుండగా.. 4వ తేదీకి డీజే టిల్లు ఖరారైంది. 25వ తేదీన విడుదల అంటూ ఆడవాళ్ళు మీకు జోహార్లు టీం ప్రకటన ఇచ్చింది.
కాగా ఇప్పుడు ఫిబ్రవరి విడుదలకు మరో సినిమా రెడీ అయిపోయింది. విశాల్ కొత్త సినిమా సామాన్యుడు (తమిళంలో వీరమే వాగై సూడుం)ను ఫిబ్రవరి 4న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ముందు ఈ సినిమాను సంక్రాంతి రేసులో నిలిపారు. తర్వాత జనవరి 26కు వాయిదా వేశారు. కానీ ఆ తేదీకి కూడా రాలేదు.
కొవిడ్ కారణంగానే రెండుసార్లు వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని.. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తెచ్చేయడానికి విశాల్ రెడీ అయ్యాడు. ఇటీవలే దీని ట్రైలర్ కూడా లాంచ్ చేయడం తెలిసిందే. విశాల్ స్టయిల్లో పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా దీన్ని తు.ప.శరవణన్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. విశాల్ సరసన ఖిలాడి భామ డింపుల్ హయతి నటించింది. విశాల్ సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.
This post was last modified on January 30, 2022 2:23 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…