Movie News

క‌ళ్యాణ్ దేవ్.. అవ‌న్నీ ప‌క్క‌న పెట్టేసి

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ‌.. క‌ళ్యాణ్ దేవ్‌ను రెండో పెళ్లి చేసుకున్న‌పుడు అత‌డి ఫొటోలు చూసిన వాళ్లలో చాలామంది కుర్రాడు బాగున్నాడే, ఇత‌ను కూడా సినిమాల్లోకి వ‌స్తాడా అని సందేహాలు వ్య‌క్తం చేశారు. కొన్నాళ్ల‌కు ఆ సందేహాలే నిజ‌మ‌య్యాయి. సూప‌ర్ స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ బాబు లాగే మెగాస్టార్ అల్లుడు సైతం హీరో అయ్యాడు. అత‌ను క‌థానాయ‌కుడిగా విజేత అనే సినిమా రావ‌డం తెలిసిందే.

దానికి గ‌ట్టిగా ప్ర‌మోష‌న్ చేసినా సినిమా ఆశించిన ఫ‌లితాన్నందుకోలేదు. అయితేనేం చిరు అల్లుడు కావ‌డంతో అవ‌కాశాలు బాగానే వ‌చ్చాయి. సూప‌ర్ మ‌చ్చి, కిన్నెర‌సాని అంటూ ఇంకో రెండు సినిమాలు పూర్తి చేశాడ‌త‌ను. కానీ రెండో సినిమా సూప‌ర్ మ‌చ్చి రిలీజ్ టైంకి ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. శ్రీజ నుంచి క‌ళ్యాణ్ విడిపోతున్న‌ట్లు వార్త‌లు రావ‌డం.. మెగా ఫ్యామిలీ స‌పోర్ట్ ఈ చిత్రానికి లేక‌పోవ‌డం, స్వ‌యంగా క‌ళ్యాణే ఈ సినిమాను ప‌ట్టించుకోకుండా వ‌దిలేయ‌డం తెలిసిందే.

ఇక కిన్నెర‌సాని సంగ‌తే తేలాల్సి ఉంది. శ్రీజ త‌న పేరు నుంచి క‌ళ్యాణ్ ప‌దాన్ని తొల‌గించేసిన నేప‌థ్యంలో ఆమె విడాకుల దిశ‌గా అడుగులేస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది. క‌ళ్యాణ్ కొన్ని నెల‌లుగా మెగా ఫ్యామిలీలో ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టిదాకా చేసిన సినిమాలేవీ వ‌ర్కవుట్ కాలేదు. పైగా మెగా ఫ్యామిలీ స‌పోర్ట్ పోయింది. ఇక క‌ళ్యాణ్ ఇండ‌స్ట్రీలో ఏం నిల‌దొక్కుకుంటాడు.. అత‌డికెవ‌రు సినిమాలిస్తారు అన్న చ‌ర్చ న‌డుస్తోంది.

కానీ ఇవేవీ ప‌ట్టించుకోకుండా క‌ళ్యాణ్ త‌న బాడీ పెంచే ప్ర‌య‌త్నంలో ప‌డ్డాడు. చాన్నాళ్ల త‌ర్వాత అత‌డి ఫొటో ఒక‌టి మీడియాలోకి వ‌చ్చింది. అది జిమ్‌లో తీసుకున్న ఫొటో. బాగా కండ‌లు పెంచి చిజిల్డ్ బాడీతో క‌నిపిస్తున్నాడు క‌ళ్యాణ్‌. ఈ క‌ష్ట‌మంతా ఏదో కొత్త సినిమా కోస‌మే అయ్యుండొచ్చ‌ని భావిస్తున్నారు. చూస్తుంటే తాజా ప‌రిణామాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ త‌న సినీ కెరీర్ మీద క‌ళ్యాణ్‌ ఆశ‌లేమీ కోల్పోయిన‌ట్లుగా లేదు.

This post was last modified on January 30, 2022 11:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్‌ దెబ్బకు రికార్డు పతనంలో రూపాయి!

రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…

14 minutes ago

కేటీఆర్ పై కేసు..అరెస్టు తప్పదా?

బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…

34 minutes ago

4వ దెయ్యంతో లారెన్స్ రిస్కు!

హారర్ కామెడీ జానర్‌లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…

1 hour ago

వైసీపీకి ప్ర‌మోట‌ర్స్ కావ‌లెను… !

ఏపీ ప్రతిప‌క్షం వైసీపీకి ప్ర‌మోట‌ర్స్ కావాలా? పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు ర‌చించ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల‌కు పార్టీని చేరువ చేసేందుకు ప్ర‌మోట‌ర్ల…

2 hours ago

ముందు రోజు ప్రీమియర్లు….జెండా ఊపిన బచ్చల మల్లి!

కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…

2 hours ago

చరణ్ భుజాల మీద భారతీయుడి బరువు!

మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…

3 hours ago