ఇప్పుడు వెబ్ సిరీస్‌ల హవా ఎలా నడుస్తోందో తెలిసిందే. కరోనా టైంలో ఓటీటీల జోరు పెరిగిపోవడంతో పెద్ద ఎత్తున వాటి కోసం ఒరిజినల్స్ తయారవుతున్నాయి. ఇంతకుముందు వెబ్ సిరీస్‌లను తక్కువగా చూసిన స్టార్లు ఒక్కొక్కరుగా ఇప్పుడు అటు వైపు అడుగులు వేస్తున్నారు. దక్షిణాది టాప్ హీరోయిన్లలో కాజల్, తమన్నా, సమంత.. వీళ్లంతా వెబ్ సిరీస్‌లు చేసిన వాళ్లే.
శ్రుతి హాసన్ విషయానికి వస్తే.. ఆమె పిట్టకథలు అనే ఆంథాలజీ వెబ్ ఫిలింలో నటించింది. కానీ అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆమె నటించిన సెగ్మెంట్ తుస్సుమనిపించింది. తర్వాత మళ్లీ వెబ్ సిరీస్‌లు, ఫిలిమ్స్ వైపు చూడలేదు శ్రుతి. కానీ ఇప్పుడు ఆమె మరోసారి ఇందులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. శ్రుతి ప్రధాన పాత్రలో ఒక ఫుల్ లెంగ్త్ వెబ్ సిరీస్ తెరకెక్కింది. అదే.. బెస్ట్ సెల్లర్.
శ్రుతితో పాటు ప్రేమలో పావని కళ్యాణ్, సంపంగి, అరుంధతి లాంటి తెలుగు చిత్రాల్లో నటించిన హిందీ నటుడు దీపక్ బెస్ట్ సెల్లర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. రచయిత రవి సుబ్రహ్మణియన్ రాసిన పాపులర్ నవల బెస్ట్ సెల్లర్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. అమేజాన్ ప్రైమ్ ఈ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేసింది.
ఫిబ్రవరి 18న బెస్ట్ సెల్లర్ ప్రిమియర్స్ పడనున్నాయి. ఇందులో శ్రుతి జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందట. ఆమె పాత్ర సంప్రదాయబద్ధంగా కనిపిస్తోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలోనే కనిపించబోతోంది శ్రుతి. మరి షార్ట్ టెర్మ్ డిజిటల్ డెబ్యూలో అంతగా ఆకట్టుకోలేకపోయిన శ్రుతి.. ఫుల్ లెంగ్త్ వెబ్ సిరీస్‌లో ఏమేర మెప్పిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన సలార్ లాంటి భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 30, 2022 9:02 am
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…