మన దర్శకనిర్మాతలు సినిమా సెట్స్ కోసం కోట్లు ఖర్చు చేస్తుంటారు. అయితే ఈ విషయంలో ఆర్ట్స్ డైరెక్టర్స్ తెలివిగా ఆలోచిస్తే.. ఓ కోట్ల ఖర్చుని తగ్గించుకోవచ్చు. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కలను స్మగుల్ చేసే పాత్రలో కనిపించాడు. సినిమా మొదలైన కాసేపటికే గంధపు చెక్కలున్న లారీను హీరో బావిలోకి నెట్టేస్తాడు. ఈ ఒక్క సీన్ కోసం నిర్మాతలు ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు చేశారని సమాచారం.
ఈ ఒక్క సీన్ కోసం ప్రత్యేకంగా బావిని తవ్వారట. సీన్ రియలిస్టిక్ గా రావడం కోసం మొత్తం రెండు కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అయితే ఇది భారీ బడ్జెట్ సినిమా కాబట్టి నిర్మాతలు ఒక్క సీన్ కోసం అంత ఖర్చు పెట్టారు. నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో కూడా ఓ బావి సీన్ ఉంటుంది గుర్తుందా..? అంటరానితనం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు బ్రాహ్మణులు వాడే నీటి బావిలోకి ఒక దళితుడిని తోసేస్తాడు హీరో నాని.
సినిమాలో ఈ సీన్ హైలైట్ గా నిలిచింది. మనుషులంతా ఒక్కటే అని.. తాగే నీటికి, పీల్చే గాలికి జాతి, మతంతో సంబంధం లేదని మెసేజ్ ఇచ్చే సీన్ అది. ఈ సీన్ కోసం నిర్మాతలు ఎంత ఖర్చు చేశారో తెలుసా..? రూ.20 వేలు. బావి కోసం చిన్న సెట్ వేసి, ఆర్ట్ వర్క్ తో సీజీని కలిపి చాలా నేచురల్ గా సీన్ వచ్చేలా చిత్రీకరించారు.
అల్లు అర్జున్ రేంజ్ కాబట్టి రూ.2 కోట్లు ఖర్చు చేశారు. నాని సినిమా బడ్జెట్ ముప్పై కోట్ల లోపే ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చుతో మరింత ఇంపాక్ట్ గా సీన్ యూ డిజైన్ చేశారు. ఏది ఏమైనా.. ఈ బావి కాన్సెప్ట్ మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడం విశేషం.
This post was last modified on %s = human-readable time difference 5:50 pm
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…