కరోనా ప్రభావం పెరిగి థియేటర్లపై ఆంక్షలు మొదలయ్యాయంటే చాలు.. ఆ సినిమా ఓటీటీకి.. ఈ సినిమా ఓటీటీకి అంటూ వార్తలు మొదలైపోతాయి. ఈ ఊహాగానాల్లో కొన్ని నిజమవుతుంటాయి కూడా. కానీ కొన్ని వార్తలు మాత్రం అస్సలు నమ్మశక్యం కావు. సినిమా స్కేల్ పరంగా చూసినా.. వాటి విజువల్ ఎక్స్‌పీరియన్స్ కోణంలో చూసినా.. కచ్చితంగా థియేటర్లలోనూ చూడాల్సిన సినిమాలు సైతం ఓటీటీ బాట పడుతున్నట్లుగా వార్తలొస్తే నమ్మబుద్ధి కాదు.
ఇప్పుడు ‘రాధేశ్యామ్’ సినిమా విషయంలోనూ జరుగుతున్నది ఇదే. ఈ సినిమాను ఎంత వేగంగా పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తేవాలని చూసినా.. కరోనా, ఇతర కారణాల వల్ల బాగా ఆలస్యం అయింది. కరోనా ఇబ్బంది పెడుతున్నా సరే.. సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని పట్టుబట్టారు కానీ.. కుదరక చివరికి వాయిదా వేయాల్సి వచ్చింది. కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడితే అప్పుడు సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేద్దామని చూస్తున్నారు.
కానీ గతంలో మాదిరే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా ఓటీటీలోకి వెళ్లబోతోందంటూ ప్రచారం ఊపందుకుంది. నిన్నట్నుంచి ఈ ప్రచారం మరీ ఎక్కువైపోయింది. కొన్ని వెరిఫైడ్ హ్యాండిల్స్, డిజిటల్ స్ట్రీమింగ్ గురించి అప్‌డేట్స్ ఇచ్చే ట్విట్టర్ అకౌంట్ల నుంచి రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ గురించి సంకేతాలు కనిపించాయి. ఒక భారీ చిత్రం ఓటీటీ బాట పడుతోందని.. చర్చలు జోరుగా జరుగుతున్నాయి.. ఇది రికార్డ్ డీల్ అంటూ అప్ డేట్స్ ఇచ్చారు. పేరు చెప్పకపోయినా.. ఆ సినిమా ‘రాధేశ్యామ్’యే అంటూ నెటిజన్లలో చర్చ మొదలైంది.
సినిమా మరీ ఆలస్యమవుతుండటంతో నిర్మాతల మీద భారం పెరిగిపోతోందని.. మార్చిలో అయినా సరే థియేట్రికల్ రిలీజ్‌కు అనుకూలమైన పరిస్థితులు ఉండవని, ఆ తర్వాత పోటీ తీవ్రంగా ఉందని, పైగా ఇదేమీ మాస్ మసాలా సినిమా కాకపోవడం, ట్రాజిక్ ఎండ్‌తో నడిచే లవ్ స్టోరీ కావడంతో థియేటర్లలో భారీ వసూళ్లు రావడం కష్టమే అని.. ఈ నేపథ్యంలో మంచి లాభానికి ఓటీటీ డీల్ కుదిరేలా ఉండటంతో నిర్మాతలు టెంప్ట్ అవుతున్నారని వార్తలొస్తున్నాయి. ఈ ఊహాగానాలపై యువి క్రియేషన్స్ వాళ్ల నుంచి ఏ స్పందనా లేకపోవడం కూడా సందేహాలకు తావిస్తోంది.
This post was last modified on January 26, 2022 2:27 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…