టాలీవుడ్లో ప్రస్తుతం రాజమౌళి తర్వాత తిరుగులేని సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను.. ఇలా ఇప్పటిదాకా చేసిన నాలుగు సినిమాలతోనూ అతను బ్లాక్‌బస్టర్లు అందుకున్నాడు. వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్లు ఇచ్చేసరికి మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడు పిలిచి ఛాన్స్ ఇచ్చాడు. ఐతే టాలీవుడ్లో ప్రతి దర్శకుడు తప్పక సినిమా చేయాలని కోరుకునే మెగాస్టార్ చిరంజీవితో ఛాన్స్ అనేసరికి కొరటాల ఉబ్బితబ్బిబ్బయ్యే ఉంటాడు.
ఈ విషయంలో తన ఆనందాన్ని వివిధ సందర్భాల్లో పంచుకున్నాడు కొరటాల. కానీ ఈ సినిమా కోసం ఆయన నాలుగేళ్లకు పైగా సమయం వెచ్చించాల్సి రావడమే విచారకరం. ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలైందో కానీ.. ఏదో ఒక అడ్డంకితో సినిమా వెనక్కి వెళ్తూనే ఉంది.
కొరటాల చివరి సినిమా ‘భరత్ అనే నేను’ రిలీజైంది 2018లో. ఇప్పుడు 2022లోకి వచ్చేశాం.
నాలుగేళ్ల తర్వాత కూడా కొరటాల కొత్త సినిమా ఎప్పుడు రిలీజవుతుందో క్లారిటీ లేదు. ఇప్పటికే చాలాసార్లు సినిమాను వాయిదా వేశారు. చివరగా ఏప్రిల్ 1కి రిలీజ్ డేట్ ఇచ్చారు. కానీ అప్పుడు కూడా సినిమా రిలీజవుతుందన్న గ్యారెంటీ లేదు. కరోనా అడ్డం పడితే ఏం చేస్తారు అన్న డౌట్ రావచ్చు. కానీ కరోనా అడ్డంకుల్ని దాటి కూడా అఖండ, పుష్ప సహా చాలా సినిమాలు రిలీజయ్యాయి.
ఇదేమైనా ‘ఆర్ఆర్ఆర్’ స్థాయి భారీ చిత్రమా అంటే అదీ కాదు. ‘ఆచార్య’ ఓకే అయినపుడే ‘ఆర్ఆర్ఆర్’కు కూడా శ్రీకారం చుట్టారు. ఇంత భారీ చిత్రాన్ని పూర్తి చేసి ఫస్ట్ కాపీతో రెడీగా పెట్టుకున్నారు. పరిస్థితులు అనుకూలించక విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. కానీ ‘ఆచార్య’ మాత్రం విడుదలకు ఇప్పటికీ సిద్ధంగా లేదు. షూటింగ్‌లో ఆలస్యం.. పోస్ట్ ప్రొడక్షన్లో ఆలస్యం.. ఇలా విపరీతంగా లేటే అవుతోంది. మామూలుగా వేగంగా సినిమాలు తీసేసే కొరటాల.. ఈ సినిమాకు ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నాడో అర్థం కావడం లేదు.
దీని పని పూర్తయితే కానీ.. ఎన్టీఆర్‌తో కొత్త సినిమా మొదలుపెట్టలేడు. దీని వల్ల తారక్ కూడా ఇబ్బంది పడుతున్నాడు. మరోవైపు ఇలా లేటవడం వల్ల ఆచార్య మీద ఆసక్తి తగ్గిపోతోంది. చిరంజీవితో సినిమా సంబరం ఏమో కానీ.. ఈ సినిమా చేయడం వల్ల కొరటాల కెరీర్లో విలువైన సమయం వేస్ట్ అయిందన్నది వాస్తవం. కనీసం ‘ఆచార్య’ బ్లాక్‌బస్టర్ అయినా అయితే కొంత నష్టం పూడ్చుకున్నట్లవుతుంది. అలా కాక సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోతే మాత్రం కొరటాలకు మెగా ఛాన్స్ ఒక చేదు అనుభవంగా మిగిలిపోతుంది.
This post was last modified on January 25, 2022 11:37 am
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…