యంగ్ హీరోలందరూ వరుసగా పెళ్లి పీటలెక్కేశారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌లో దాదాపు అందరూ ఒకింటివాళ్లు అయిపోయారు. కానీ నవదీప్ మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే చక్కర్లు కొడుతున్నాడు. దాంతో చాలామంది తనని పెళ్లెప్పుడని అడుగుతున్నారు. త్వరగా పెళ్లి చేసుకోమంటూ కొందరు సలహాలు కూడా ఇస్తున్నారు.
దానికి తనదైన స్టైల్లో రియాక్టయ్యాడు నవదీప్. పెళ్లి విషయంలో తనకు సలహాలిస్తున్న వారి కోసం ‘వద్దురా సోదరా’ అంటూ ట్విటర్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు నవదీప్. ‘నీ గడ్డం తెల్లబడుతోంది త్వరగా పెళ్లి చేసుకో అని కొంతమంది నాకు సలహాలు ఇస్తున్నారు. గడ్డం తెల్లబడితే చేయాల్సింది ట్రిమ్మింగ్ కానీ పెళ్లి కాదు’ అంటూ ఉచిత సలహాలు ఇచ్చేవారిపై కౌంటర్ వేశాడు.
అంతే కాదు.. ‘దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా’ అంటూ ఫన్నీగా ఫిలాసఫీ కూడా చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లి చేసుకోమంటే ఫిలాసఫీ చెప్తాడేంటి అని కొందరు అంటుంటే.. ఏం చెప్పావ్ భయ్యా అంటూ భార్యా బాధితులు భుజం తడుతున్నారు. ఇంతకీ ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ పెళ్లంటే ఎందుకింత భయపడుతున్నట్టో!
Gulte Telugu Telugu Political and Movie News Updates