Movie News

పెళ్లిపై మిల్కీబ్యూటీ రియాక్షన్!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. కొత్త హీరోయిన్ల హవా పెరగడంతో తమన్నాకు మధ్యలో అవకాశాలు తగ్గాయి. అయితే ఇప్పుడు మళ్లీ దర్శకనిర్మాతలు ఆమెకి అవకాశాలు ఇస్తున్నారు. అప్పుడెప్పుడో 2005లో ‘శ్రీ’ అనే సినిమాతో పరిచయమైన తమన్నా.. ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది. 

ఇదిలా ఉండగా.. రీసెంట్ గా తమన్నా స్నేహితురాలు కాజల్ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తల్లి కూడా కాబోతుంది. మరి తమన్నా ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఆమె ఎవరితో డేటింగ్ చేస్తున్నట్లు ఇప్పటివరకు ఒక్క న్యూస్ కూడా వినిపించలేదు. ఈ క్రమంలో తన పెళ్లిపై స్పందించింది తమన్నా. 

మరో రెండేళ్లవరకు పెళ్లి ఆలోచన లేదని క్లియర్ గా చెప్పేసింది. నిజానికి ఆమెకి అవకాశాలు తగ్గిన సమయంలో పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇంట్లో సంబంధాలు కూడా చూశారు. కానీ ఇప్పుడు ఆమె కెరీర్ ఊహించని విధంగా టర్న్ తీసుకుంది. ఒక్కో సినిమాకి రూ.1.5 నుంచి 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

దీంతో మరో రెండేళ్లవరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుందట. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఎఫ్3′ సినిమాలో నటిస్తోంది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళాశంకర్’ సెట్స్ పైకి వెళ్లనుంది. వీటితో పాటు కన్నడలో ఓ పాన్ ఇండియా సినిమాలో నటించడానికి ఒప్పుకుందని సమాచారం. సినిమాలతో పాటు ఓటీటీ ప్రాజెక్ట్స్ లో కూడా నటిస్తోంది తమన్నా.   

This post was last modified on January 23, 2022 4:55 pm

Share

Recent Posts

పెళ్లి గురించి హనుమాన్ హీరో క్లారిటీ

టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న…

5 hours ago

లెక్క తప్పిన చుక్క చిత్రాలు… ఇమేజ్ మీద మరకలు

భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అని కథ పూర్తిగా వినకుండా, జల్లెడ పట్టకుండా తొందరపడితే…

5 hours ago

సెక్యూరిటీ లేకుండా వెళ్లి చంద్రబాబుతో పవన్ ఏం చెప్పారు?

సుప్రీం కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.…

6 hours ago

అర్జునుడి కష్టాలు పేరుకి తగ్గట్టే ఉన్నాయి

తమ స్వంత ప్రమేయం లేకుండా ఎవరి వల్లనో ఇబ్బందులు, కష్టాలు పడాల్సి వస్తే ఆ బాధ మాములుగా ఉండదు. ఇట్లు…

6 hours ago

ప్రశాంత్ నీల్ బ్రాండ్ మహత్యం ఇది

కెజిఎఫ్, సలార్ రూపంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తను డైరెక్ట్ చేయకపోయినా కేవలం కథను…

7 hours ago

సంజూ మొదలెట్టాడు… నమన్ ధీర్ ముగించాడు!

225 పరుగులు చేసినా న్యూజిలాండ్‌కు విజయం దక్కలేదు. టీమ్ఇండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. అయితే…

7 hours ago