పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన దర్శకులకు డెడ్ లైన్ విధించినట్లు సమాచారం. అన్ని సినిమాలకు రెండేసి నెలలే కాల్షీట్స్ ఇస్తారట. అసలు విషయంలోకి వస్తే.. 2024లో ఎన్నికలు జరగనున్నాయి. 2023లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వనున్నారు. ఒక్కసారి అటువైపు వెళ్తే.. మళ్లీ సినిమాలకు సమయం కేటాయించలేకపోవచ్చు.
అందుకే తన చేతుల్లో ఉన్న సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ‘భీమ్లానాయక్’ సినిమా దాదాపుగా పూర్తయినట్లే. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా సగం పూర్తయింది. ఈ సినిమాకి మరో నలభై రోజులు కాల్షీట్స్ కేటాయించాల్సి ఉంది. అందుకే మరో షెడ్యూల్ లో మొత్తం సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు .
ఆ తరువాత హరీష్ శంకర్ సినిమా లైన్ లో ఉంది. ఆ సినిమాకి పవన్ 60 రోజులు కాల్షీట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రెండు నెలల్లో సినిమాను పూర్తి చేయాలని ఇప్పటికే హరీష్ కి చెప్పినట్లు తెలుస్తోంది. వేగంగా సినిమాలను పూర్తి చేయడంలో హరీష్ కి మంచి అనుభవం ఉంది. మరి పవన్ సినిమాను కూడా అంతే వేగంగా పూర్తి చేస్తారేమో చూడాలి.
ఇక సురేందర్ రెడ్డితో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు పవన్. ఆ సినిమా కూడా రెండు నెలల్లో పూర్తి చేసేయాలని టార్గెట్ పెట్టారట పవన్. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అది పూర్తి కావడానికి సమయం పడుతుంది. ఈలోగా పవన్ క్రిష్, హరీష్ శంకర్ ల సినిమాలు పూర్తి చేస్తారు. ఆ తరువాత సురేందర్ రెడ్డి సెట్స్ పైకి వస్తారు. మొత్తానికి ఈ ఏడాదిలో మూడు సినిమాను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు పవన్. మరి అనుకున్నట్లుగా టైంకి సినిమాలు పూర్తవుతాయో లేదో చూడాలి!
This post was last modified on January 23, 2022 11:30 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…