కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘జైభీమ్’ సినిమా విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా టాప్ రేటింగ్ సంపాదించింది. ఇండియన్ సినిమా స్థాయిలో పెంచిన చిత్రాల్లో ఇదొకటి అని గర్వంగా చెప్పొచ్చు. రీసెంట్ గానే ఈ సినిమాలో ఓ సన్నివేశాన్ని ప్రపంచ ప్రఖ్యాత అవార్డు సంస్థ ఆస్కార్స్ యూట్యూబ్ ఛానెల్ ప్రసారం చేసింది. ఇప్పటివరకు ఏ తమిళ సినిమాకు ఇలాంటి గౌరవం దక్కలేదు.
ఇప్పుడు ఏకంగా ‘జైభీమ్’ ఆస్కార్ 2022 అవార్డ్స్ కి బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో నామినేట్ అయింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించి ఈరోజు ఆస్కార్ బరిలో నిలిచింది ‘జైభీమ్’.
తమ అభిమాన హీరో సినిమా ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సూర్య ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నారు. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సూర్య నిర్మించారు.
ఈ సినిమాతో పాటు మోహన్ లాల్ నటించిన ‘మరక్కార్’ కూడా ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయింది. 16వ శతాబ్దపు చారిత్రాత్మక పాత్ర అయిన కుంజలి మరక్కార్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ‘మరక్కార్’కి అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆస్కార్ బరిలో చోటు దక్కించుకోవడం విశేషం.
This post was last modified on January 21, 2022 12:57 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…