నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలానే ‘అన్ స్టాపబుల్’ షోతో ఓటీటీలో కూడా తన సత్తా చాటుతున్నారు. హోస్ట్ గా బాలయ్యను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో హోస్ట్ చేసిన షోకి కూడా ఈ రేంజ్ లో రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. దాన్ని బట్టి బాలయ్య క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. బాలయ్యతో ఇలాంటి షో చేయాలనేది అల్లు అరవింద్ ఆలోచన.
ఆయన ప్లాన్ బాగానే వర్కవుట్ అవుతోంది. అయితే ఇప్పుడు బాలయ్యతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు అల్లు అరవింద్. తన గీతాఆర్ట్స్ బ్యానర్ పై బాలయ్యను హీరోగా పెట్టి ఓ భారీ బడ్జెట్ సినిమా చేయాలనుకుంటున్నారు. అల్లు అరవింద్ తో ఉన్న బాండింగ్ కారణంగా బాలయ్య ‘నో’ చెప్పే ఛాన్స్ లేదు. కాబట్టి ఈ కాంబినేషన్ లో సినిమా రావడం పక్క అని చెబుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
ప్రస్తుతం అల్లు అరవింద్ కొందరు దర్శకులతో డిస్కషన్స్ జరుపుతున్నాడట. ఒక్కసారి డైరెక్టర్ ఫిక్స్ అయితే వెంటనే సినిమాను అనౌన్స్ చేయాలని చూస్తున్నారు. గీతాఆర్ట్స్ లో ఎక్కువగా మెగాహీరోల సినిమాలనే నిర్మిస్తున్నారు. అప్పట్లో వరుసగా చిరంజీవితోనే సినిమాలు చేసేవారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోల సినిమాలను నిర్మించారు.
ఈ మధ్యకాలంలో బయట హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్యతో పెద్ద సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు అల్లు అరవింద్. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
This post was last modified on January 21, 2022 11:00 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…