Movie News

200 కోట్ల అఖండ?

నందమూరి బాలకృష్ణ కెరీర్లో ‘అఖండ’ ముందు వరకు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్ సినిమానే లేదు. థియేట్రికల్ వసూళ్లకు తోడు.. నాన్ థియేట్రికల్ ఆదాయమంతా కూడా కలిపినా కూడా ఏ చిత్రమూ రూ.100 కోట్ల మార్కును అందుకోలేదు. అందులోనూ ‘అఖండ’కు ముందు బాలయ్య నుంచి వచ్చిన చివరి చిత్రం ‘రూలర్’ అయితే మొత్తంగా రూ.20 కోట్ల ఆదాయం కూడా తెచ్చి పెట్టలేదు నిర్మాతకు.

ఈ నేపథ్యంలో ‘అఖండ’ ఎంత పెద్ద హిట్టయినా సరే.. రూ.100 కోట్ల ఆదాయం అందుకున్నా అద్భుతమే అనుకున్నారు. కానీ ఈ చిత్రం ఓ మోస్తరు టాక్‌తోనే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. బాక్సాఫీస్ దగ్గర దీనికి అన్ని రకాలుగా కలిసొచ్చి ఎవ్వరూ ఊహించని రీతిలో లాంగ్ రన్‌తో నడిచింది. వందకు పైగా సెంటర్లలో ఈ చిత్రం 50 రోజులు ఆడిందంటే దాన్నొక అద్భుతంగానే చెప్పాలి. గతంలో మాదిరి ఫేక్ థియేటర్లు వేసుకుంటే సోషల్ మీడియా జనాలు తేలిగ్గా వదిలేయరు. ఒక్క సెంటర్ తప్పున్నా ఏకి పడేస్తారు.

50 రోజుల సెంటర్ల లిస్టు మొత్తం కరెక్టే. అక్కడ పేర్కొన్న ప్రతి సెంటర్లోనూ ఈ చిత్రం 50 రోజులు ఆడింది. కాకపోతే మల్టీప్లెక్సుల్లో రోజుకు 4 షోలు అయితే ఆడకపోయి ఉండొచ్చు. ఆ విషయంలో కాస్త చూసీ చూడనట్లు వదిలేయాలి. ఇక ఈ సినిమా వసూళ్ల గురించి నిర్మాత ఇప్పటిదాకా పెద్దగా హడావుడి చేసింది లేదు. ఈ విషయంలో అభిమానుల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు మిర్యాల రవీందర్ రెడ్డి. 

బోయపాటి, బాలయ్య సైతం వసూళ్ల గురించి ఎందుకు హంగామా చేయలేదో వివరణ కూడా ఇచ్చారు. ఐతే 50 రోజుల పోస్టర్ల మీద తాజాగా వేసిన వసూళ్ల ఫిగర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమా రూ.200 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టినట్లుగా పేర్కొన్నారు ఒక పోస్టర్ మీద. ఐతే విడుదలైన రెండు వారాలకు ‘అఖండ’ వంద కోట్ల గ్రాస్ మార్కును అందుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇంతలో రూ.200 కోట్ల వసూళ్లెలా సాధించిందని ఆశ్చర్యం కలగొచ్చు. ఐతే థియేట్రికల్ వసూళ్లకు తోడు నాన్ థియేట్రికల్ ఆదాయం కలిపితే రూ.200 కోట్లు అని పేర్కొన్నారు. కానీ ఈ సినిమా థియేట్రికల్ వసూళ్లు అటు ఇటుగా రూ.140 కోట్ల దాకా వచ్చాయి. మరి నాన్ థియేట్రికల్ వసూళ్లతో రూ.60 కోట్లు వచ్చాయంటే నమ్మశక్యంగా లేదు. ఒక 30-40 కోట్లు ఎగ్జాజరేషన్ కనిపిస్తోంది ఇందులో. అలా చూసుకున్నా బాలయ్య రేంజికి ఇది మెగా హిట్ అనడంలో సందేహం లేదు.

This post was last modified on January 20, 2022 4:30 pm

Share

Recent Posts

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

44 minutes ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

4 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

4 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

6 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

7 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

8 hours ago