తమ ఫేవరేట్ హీరోల సినిమాలనే కాదు.. ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ ఏదైనా సరే.. ప్రేక్షకుల దృష్టి ప్రతి క్షణం దానిపై ఉంటుంది. ఏం జరుగుతోంది, ఆ సినిమా నుంచి ఎప్పుడు ఏ అప్‌డేట్ వస్తుంది అని ఆరా తీస్తుంటారు. ఇక ఫలానా రోజు ఫలానా టైమ్‌కి ఫలానా అప్‌డేట్ ఇవ్వబోతున్నాం అని మేకర్స్ అనౌన్స్ చేశారో.. ఇక ఆ క్షణం కోసం వాచీలు చూసుకుంటూనే ఉంటారంతా. ఆ ఆసక్తే ఇప్పుడు సమస్య తెచ్చిపెట్టింది. ఈమధ్య టాలీవుడ్‌లో చాలా అప్‌డేట్స్ చెప్పిన టైముకి రావడం లేదు.
రాధేశ్యామ్ సినిమాకి ఈ సమస్య మొదట్నుంచీ ఉంది. అసలే అప్‌డేట్స్ సరిగ్గా ఇవ్వడం లేదంటూ ప్రభాస్ ఫ్యాన్స్ యూవీ క్రియేషన్స్ మీద చాలా ఫైర్ అయ్యారు. ఒక అభిమాని అయితే సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు కూడా. ఎట్టకేలకి రిలీజ్ డేట్ దగ్గరికొచ్చాక అప్‌డేట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు. కానీ అవి చెప్పిన టైముకి కాకుండా ఆలస్యంగా రావడంతో కొన్నిసార్లు ఫ్యాన్స్ విసుక్కునే పరిస్థితి తలెత్తింది.
మొన్నామధ్య గోపీచంద్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న ‘పక్కా కమర్షియల్’ మూవీ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. కానీ కాసేపటికే సోషల్ మీడియాలో ఆ పోస్టులు డిలీటయ్యాయి. ఏవో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ డేట్‌ని ఫైనల్ చేయలేకపోతున్నామని అన్నారు. ఈమధ్యనే వైష్ణవ్ తేజ్ టైటిల్ అనౌన్స్‌మెంట్ విషయంలోనూ ఇలా జరిగింది. సాయంత్రం తమ సినిమా పేరును రివీల్ చేస్తామని చెప్పిన మేకర్స్.. ఆ టైమ్ దాటిపోయినా అప్‌డేట్ ఇవ్వలేదు. టెక్నికల్ ప్రాబ్లెమ్స్ వల్ల ఇవ్వలేకపోతున్నామని, మరో రోజు టైటిల్ అనౌన్స్ చేస్తామని ఎప్పటికో చల్లగా చెప్పారు.
ఇప్పుడు సుధీర్ బాబు సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్‌లో సుధీర్, కృతీశెట్టి జంటగా నటిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీ టీజర్ ఇవాళ విడుదల కావాల్సి ఉంది. కానీ రిలీజ్ కాలేదు. కొత్త డేట్‌ని త్వరలోనే చెప్తామని ప్రకటించారు. దీనికి వాళ్లు చెప్పిన కారణమూ టెక్నికల్ సమస్యలే. ఇలా మాటిమాటికీ టెక్నికల్ ఇష్యూస్ ఎందుకొస్తున్నాయో తెలీదు కానీ.. ఫ్యాన్స్‌ని మాత్రం ఈ డిలే చాలా డిజప్పాయింట్ చేస్తోంది.
నిజానికి మొన్న సర్కారు వారి పాట సంక్రాంతి అప్‌డేట్‌ని కూడా మేకర్స్ రిలీజ్ చేయలేకపోయారు. టీమ్‌లో ముఖ్యులైన మహేష్, తమన్ లాంటి వారు కోవిడ్ బారిన పడటమే అందుకు కారణం. ఆ విషయాన్ని వాళ్లు సిన్సియర్‌గా చెప్పారు కూడా. మిగతావారు కూడా ఇలా కరెక్ట్ రీజన్ చెప్పేస్తే సమస్య ఉండదు. అలా కాకుండా సినిమా టైటిల్ చెప్పడానికి కూడా టెక్నికల్ ఇష్యూస్ అడ్డొచ్చాయి అంటుంటే అసలేం జరుగుతోందో అభిమానులకు ఏమాత్రం అంతుపట్టడం లేదు.
This post was last modified on %s = human-readable time difference 4:15 am
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…