‘అఖండ’ సినిమా రిలీజై నెలన్నర అవుతోంది. ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమాలకు లాంగ్ రన్ రోజులు ఎప్పుడో పోయాయి. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత మంచి టాక్ తెచ్చుకున్నా.. రెండు మూడు వారాల తర్వాత అడ్రస్ ఉండట్లేదు. నెల రోజులకు థియేట్రికల్ రన్ పూర్తయిపోతోంది. ఇలాంటి స్థితిలో ‘అఖండ’ నెల రోజుల తర్వాత కూడా వీకెండ్స్‌లో హౌస్ ఫుల్స్‌తో నడవడం ఊహించలేని విషయం.
45వ ఏడో వారంలో కూడా ఈ సినిమాకు ఏపీ, తెలంగాణల్లో చెప్పుకోదగ్గ వసూళ్లే వస్తున్నాయి. సంక్రాంతి రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ సినిమాకు దాదాపు హౌస్ ఫుల్స్ పడ్డాయి. రెండు లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ అయింది. సంక్రాంతికి రిలీజైన కొత్త సినిమాలకు దీటుగా ఈ చిత్రం వసూళ్లు రాబట్టింది పండుగ రోజు.హైదరాబాద్ అనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలన్నింట్లో ఈ వీకెండ్లో ‘అఖండ’ మంచి వసూళ్లు రాబడుతోంది.
50 డేస్ థియేట్రికల్ రన్ గురించి అంతా మరిచిపోయిన పరిస్థితుల్లో ‘అఖండ’ దాదాపు 50కి పైగా సెంటర్లలో అర్ధ శత దినోత్సవం జరుపుకోబోతోందని సమాచారం. ఒక్క అనంతపురం జిల్లాలో ఈ సినిమా 10 సెంటర్లలో రన్ కొనసాగిస్తుడటం విశేషం. సంక్రాంతికి ఈ సెంటర్లన్నింటిలోనూ మంచి ఆక్యుపెన్సీ కనిపించింది.
‘అఖండ’ లాంటి డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు ఇంత లాంగ్ రన్ రావడం.. ఇన్ని సెంటర్లలో అర్థశతదినోత్సవం దిశగా అడుగులు పడుతుండటం ఒక సంచలనమే. దీని తర్వాత వచ్చిన ‘పుష్ప’ మూవీ వారం కిందటే అమేజాన్ ప్రైంలో వచ్చేయడం ‘అఖండ’ సంక్రాంతి రన్‌కు కలిసొచ్చింది. దీనికి తోడు పండక్కి రిలీజైన సినిమాలు అంచనాలకు తగ్గట్లు లేకపోవడం కూడా ప్లస్ అయింది.
This post was last modified on January 16, 2022 1:37 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…