పోయినేడు సుల్తాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తి.. ఈ యేడు మూడు సినిమాలతో రాబోతున్నాడు. వీటిలో విరుమాన్ మూవీ ఒకటి. ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో డైరెక్టర్ శంకర్ కూతురు అదితి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు.
ఈ మూవీ ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. చూడగానే వహ్వా అనిపిస్తోంది. మెరూన్ కలర్ షర్ట్, బ్రౌన్ కలర్ లుంగీ ధరించిన కార్తి.. చేతిలో బళ్లెం పట్టుకుని ఉన్నాడు. రాళ్లమీద కూర్చుని తీక్షణంగా దేని గురించో ఆలోచిస్తున్నాడు. మనిషి ఊర మాస్‌గా ఉన్నాడు. కాస్త అగ్రెసివ్‌గానూ కనిపిస్తున్నాడు.
చూస్తుంటే తన పర్‌ఫార్మెన్స్‌తో మరోసారి మెస్మరైజ్ చేస్తాడనిపిస్తోంది. ఈ సినిమా మొత్తం మధురై దగ్గర ఉన్న ఓ చిన్న ఊరిలో జరుగుతుంది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీస్తున్నాడు ముత్తయ్య. కార్తి నటనతో పాటు యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకి హైలైట్ అంటున్నారు. మరోవైపు కార్తి హీరోగా మిత్రన్ తెరకెక్కిస్తున్న సర్దార్ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.
వీలైనంత త్వరగా మూవీని పూర్తి చేసి ఈ యేడు సెకెండాఫ్‌లో రిలీజ్ చేయాలనే ప్లాన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’లోనూ నటిస్తున్నాడు కార్తి. ఇది కూడా ఈ సంవత్సరమే విడుదల కాబోతోంది. ఇవి కాక ‘ఖైదీ 2’ కూడా కార్తి చేతిలో ఉంది. మొత్తానికి వరుస సినిమాలతో… దేనికదే వెరైటీ కాన్సెప్టులతో సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు కార్తి.
This post was last modified on January 14, 2022 4:37 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…