ఎన్టీఆర్ రాయల్ లుక్.. ఫొటో వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఇండస్ట్రీకి చెందిన బడా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తన సొంత టాలెంటెడ్ తో స్టార్ హీరోగా ఎదిగారు. ఆయనకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఎంత ఎదిగినా.. ఒదిగే ఉంటారు ఎన్టీఆర్. తన అభిమానులకు కష్టమొచ్చిందంటే వెంటనే స్పందిస్తుంటారు. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నిజానికి ఎన్టీఆర్ లుక్ లో రాజసం ఉట్టిపడుతుంటుంది. ఆయన ఎంత సింపుల్ గా డ్రెస్ చేసుకున్నా.. చాలా రాయల్ గా కనిపిస్తుంటారు. అలాంటిది నిజంగానే రాయల్ గెటప్ లో కనిపిస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి..? ఫ్యాన్స్ ఫిదా కాకుండా ఉంటారా..? అసలు సాధ్యం కాదు. తాజాగా ఎన్టీఆర్ రాయల్ లుక్ లో దర్శనమిచ్చారు.

రాయల్ బ్లూ బంద్‌గాలా సూట్ ను ధరించి ఫొటోషూట్ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో బయటకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఎన్టీఆర్ లుక్ ని తెగ పొగిడేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఎన్టీఆర్ ఓ ఫొటోషూట్ కోసం ఇలా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆకర్షణీయమైన బంద్‌గాలా సూట్‌లో ఇండియన్ ట్రెడిషన్ ను గుర్తుచేశారు ఎన్టీఆర్.

ఈ ఫొటో వైరల్ అవ్వడంతో తారక్ ఫ్యాన్స్ కూడా ఆయన లుక్ కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ వాయిదా పడడంతో తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.