అందం.. నటన.. ఇలా దేన్ని వంక పెట్టే అవసరం లేనప్పటికీ.. తీసుకున్న నిర్ణయాలు.. వేసిన తప్పటడుగులు హీరోయిన్ అమలాపాల్ కెరీర్ ను.. వ్యక్తిగత జీవితాన్ని ఎంతలా డిస్ట్రబ్ చేశాయో తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యల్ని చేసేందుకు ఏ మాత్రం వెనుకాడని ఆమె.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగినా.. అదెక్కువ కాలం నిలవలేదు. సౌత్ లో వెలుగులు చిమ్మిన అమలాపాల్.. చాలా తర్వగానే తన స్టార్ డమ్ ను కోల్పోయారు.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో స్టార్ హీరోల పక్కన చాన్సుల్ని సొంతం చేసుకున్న ఈ డస్కీ బ్యూటీ.. చాలా తక్కువ వ్యవధిలోనే తన కెరీర్ గ్రాఫ్ ను పడేసుకున్నారు.
అప్పుడప్పుడు సినిమా అవకాశాన్ని సొంతం చేసుకుంటున్న అమలాపాల్.. తాజాగా వెబ్ సిరీస్ లను చేస్తూ.. తన ఉనికిని చాటి చెబుతోంది. ఆ మధ్య తెలుగులో కుడి ఎడమైతే వెబ్ సిరీస్ లో నటించిన ఆమె.. తాజాగా హిందీలో ‘రంజిష్ హీ సహీ’ అనే వెబ్ సిరీస్ లో నటించింది.
ఈ రోజు వూట్ ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి ట్రైలర్ ఇప్పటికే మంచి పేరు తెచ్చుకుంది. ఈ సిరీస్ తో అమలాపాల్ కు మరింత గుర్తింపు వస్తుందని చెబుతున్నారు.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ నిర్మాత మహేశ్ భట్ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా నిర్మించిన ఈ సిరిసీ్ లో నటి పర్విన్ బాబీ పాత్రలో అమలపాల్ ఒదిగిపోయినట్లు చెబుతుననారు. మద్యానికి.. సిగిరెట్ కు బానిస అయిన స్టార్ నటిగా ఇందులో కనిపించనున్న అమలాపాల్.. లిప్ లాక్ లతో హోరెత్తించిందని చెబుతున్నారు.
ఈ వెబ్ సిరీస్ యాబై శాతం మహేశ్ భట్ జీవితమని.. మరికొంత ఫిక్షన్ కలిపి తీసినట్లుగా తాహిర్ రాజ్ బసీన్ చెబుతున్నాడు. ఇతడు ఎవరంటే.. ఈ సిరీస్ లోమహేశ్ భట్ పాత్రను పోషిస్తున్నాడు. ఇతడు వెంటనే గుర్తుకు రావాలంటే..ఈ మధ్యనే విడుదలైన ‘83’ మూవీలో సునీల్ గవాస్కర్ పాత్రను పోషించాడు. ఈ సిరీస్ తో అమలాపాల్ లోని నటి మాత్రమే కాదు..ఆమెలో గ్లామర్ పాళ్లు తగ్గలేదన్న విషయాన్ని చాటి చెబుతుందని చెబుతున్నారు. ఆమెకు ఈ సిరీస్ గుర్తింపు తెచ్చి పెట్టటమే కాదు.. మరిన్ని అవకాశాల్ని ఇస్తుందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on January 13, 2022 1:41 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…