ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ప్రధాన సమస్య అంటే.. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల వ్యవహారమే. గత ఏడాది వేసవిలో విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’కు రేట్లను తగ్గించిన ఏపీ ప్రభుత్వం.. ఆ తర్వాత కూడా అవే రేట్లను కొనసాగించడం తెలిసిందే. పెద్ద నగరాలు, పట్టణాల వరకు ఓకే కానీ.. మిగతా చోట్ల ప్రభుత్వం నిర్దేశించిన రేట్లతో థియేటర్లను నడపడం చాలా కష్టమవుతోందన్న అభిప్రాయం ఎగ్జిబిటర్ల నుంచి వ్యక్తమవుతోంది.
ఈ సమస్య పరిష్కారానికి ఇండస్ట్రీ నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటిదాకా పరిష్కారం ఏమీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి కొన్ని నిరసన గళాలు కూడా వినిపిస్తున్నాయి. నాని సహా కొందరి కామెంట్లు ఎంత చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే. తాజాగా నందమూరి బాలకృష్ణ ఈ విషయమై హాట్ కామెంట్స్ చేశారు.
తన కొత్త చిత్రం ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ అయిన నేపథ్యంలో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో పాల్గొన్న బాలయ్యకు ఏపీలో టికెట్ల వ్యవహారానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి బదులుగా ఈ విషయంలో సినీ పరిశ్రమ మొత్తం కలిసి కట్టుగా ఉండటం అవసరమని బాలయ్య వ్యాఖ్యానించాడు. టికెట్ ధరలపై చిత్ర పరిశ్రమ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని అన్నాడు.
ఏపీలో టికెట్ల వ్యవహారంపై సినీ పరిశ్రమ నుంచి సరైన రెప్రజెంటేషన్ లేకపోవడమే సమస్యగా మారిందా అని బాలయ్యను అడిగితే.. అక్కడ వినిపించుకునే నాథుడెక్కడ అని ఎదురు ప్రశ్నించారు బాలయ్య. ఈ వ్యాఖ్యలు వెంటనే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మరి బాలయ్య వ్యాఖ్యలపై సినిమాటోగ్రఫీ పేర్ని నాని సహా మంత్రులు, వైకాపా నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరం. నానీని టార్గెట్ చేసినట్లే బాలయ్యను కూడా టార్గెట్ చేసుకుని మాట్లాడతారేమో చూడాలి.
This post was last modified on January 12, 2022 5:36 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…