ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో ‘హీరో’ సినిమా ఒకటి. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే సినిమాలో చాలా మంది పేరున్న నటీనటులు ఉన్నారు.
రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్ ను క్వాలిటీతో చిత్రీకరించారు. ఇదిలా ఉండగా.. ఈ కథ ముందుగా చాలా మంది యంగ్ హీరోల దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నితిన్ హీరోగా ఈ సినిమా చేయాలనుకున్నారట శ్రీరామ్ ఆదిత్య. దానికి సంబంధించిన డిస్కషన్స్ కూడా జరిగాయట.
నితిన్ తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు కానీ ప్రాజెక్ట్ చేతులు మారింది. ఫైనల్ గా ‘హీరో’ స్టోరీ అశోక్ గల్లా దగ్గరకు వచ్చింది. ఎప్పటికైనా సినిమా హీరో అవ్వాలని కలలు కనే ఓ కుర్రాడు.. సడెన్ గా ఓ మర్డర్ మిస్టరీలో చిక్కుకుంటాడు. ఆ మర్డర్ స్టోరీ ఏంటి..? దాని నుంచి హీరో ఎలా బయటపడ్డాడనేదే స్టోరీ.
ట్రైలర్ లో కథ చెప్పకుండా జాగ్రత్త పడినప్పటికీ.. మెయిన్ ప్లాట్ ఇదేనని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రెండు, మూడు కామెడీ ఎపిసోడ్స్ లో రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు.
ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన ఓ ట్రాక్ ను పెట్టారట. అది చూస్తున్నంతసేపు ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారని చాలా నమ్మకంగా చెబుతున్నారు. మరి తన మొదటి సినిమాతో అశోక్ గల్లా ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!
This post was last modified on January 12, 2022 1:13 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…