ప్రతి భాషలోనూ బోలెడన్ని బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. కానీ ఏ బయోపిక్‌కీ జరగని రచ్చ ఓ మూవీ విషయంలో జరిగింది. అదే.. 800. శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తీయాలనుకున్నాడు ఎమ్మెస్ శ్రీపతి. ముత్తయ్య పాత్రకి విజయ్ సేతుపతిని తీసుకున్నాడు. కానీ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. దానికి కారణం కూడా చాలా బలమైనది.
అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. అది చూసి అందరూ ఇంప్రెస్ అయిపోయారు. ముత్తయ్యలా కనిపించడానికి ఎంతో అద్భుతంగా మేకోవర్ అయ్యాడు సేతుపతి. అతనినే చూస్తున్నామా అనిపించేంతగా మారిపోయాడు. ఆ పాత్రకి తనే పర్‌ఫెక్ట్ అని ప్రతి సినీ లవర్ అనుకున్నాడు. కానీ యాంటీ తమిళ్ స్టాండ్ తీసుకున్న ముత్తయ్య జీవితాన్ని సినిమాగా తీయడానికి వీల్లేదంటూ కొందరు కాంట్రవర్శీకి తెర తీశారు.
విజయ్ సేతుపతికి కూడా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అచ్చమైన తమిళియన్ అయ్యుండి, తమిళులను వ్యతిరేకించిన వ్యక్తి పాత్రలో నటిస్తావా అంటూ ఘాటుగా విమర్శించారు. చంపేస్తామని బెదిరించారు కూడా. విషయం తన కుటుంబ సభ్యుల వరకు వస్తూ ఉండటంతో, ఆ ఒత్తిడికి తట్టుకోలేక సేతుపతి తప్పుకున్నాడు. తాను ఆ పాత్ర చేయడం లేదని ప్రకటించాడు. అయితే సేతుపతి వదిలేసినా దర్శకుడు ప్రాజెక్ట్‌ని వదల్లేదు. మరో నటుడితో సినిమా తీయాలని ఫిక్సయ్యాడు.
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్‌తో ‘800’ మూవీని తీసేందుకు శ్రీపతి ఏర్పాట్లు చేస్తున్నాడని కోలీవుడ్ టాక్. దేవ్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. హోటల్ ముంబై, ద వెడ్డింగ్ గెస్ట్, ద గ్రీన్ నైట్ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్‌గా ఒక ఓటీటీ కోసం దర్శకుడిగా మారాడు. ఓ మూవీని డైరెక్ట్ చేస్తూ లీడ్ రోల్ చేస్తున్నాడు. ముత్తయ్య పాత్ర చేయడానికి అతను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దేవ్ లండన్‌లో సెటిలైన గుజరాతీ కుటుంబంలో పుట్టాడు. కాబట్టి ఈ పాత్ర చేయడంలో తనకెలాంటి సమస్యలూ రావు. కాకపోతే సమస్యంతా ముత్తయ్యతోనే. అతనంటేనే వ్యతిరేకతతో ఉన్న తమిళులు మరోసారి సినిమాని అడ్డుకోరా అనేదే పెద్ద ప్రశ్న.
This post was last modified on January 12, 2022 8:10 am
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…