హీరోయిన్లకి రెమ్యునరేషన్ విషయంలో అన్యాయం జరుగుతోంది అనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. హీరోలతో సమానంగా ఇవ్వకపోయినా, తమ కష్టానికి తగిన ఫలితం ఉండాలంటూ చాలామంది హీరోయిన్లు ఇప్పటికే డిమాండ్ చేశారు. ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు తాము కోరినంత రెమ్యునరేషన్ అందుకుంటున్నవారూ ఉన్నారు. అలాంటి వారిలో సౌత్‌లో నయనతార, నార్త్‌లో ఆలియాభట్‌లు మొదటి స్థానాల్లో ఉన్నారు.
‘గాడ్‌ఫాదర్’ మూవీలో చిరంజీవికి చెల్లెలిగా నటించడానికి నయనతార నాలుగు కోట్లు అడిగిందని తెలియగానే అందరూ షాకైపోయారు. దాని గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. ఎందుకంటే మన దగ్గర అది చాలా పెద్ద అమౌంట్. అందులోనూ హీరోయిన్‌కి అంత ఇవ్వడం అనేది నిజంగా విశేషమే. ఇక నార్త్‌లో ఆలియా గురించి కూడా అలాగే చెప్పుకుంటున్నారు.
సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘గంగూబాయ్ కథియావాడి’ మూవీ కోసం ఆలియా ఇరవై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందనే విషయం తాజాగా బైటికి వచ్చింది. దాంతో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది. ఈ మూవీతో పాటు ఆలియా నటించిన ఆర్‌ఆర్‌ఆర్ కూడా రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇంకా బ్రహ్మాస్త్ర, రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్‌కహానీ, డార్లింగ్స్ లాంటి భారీ చిత్రాలున్నాయి తన చేతిలో.
అందుకే ఆమె డిమాండ్‌కి ఆమాత్రం పే చేయడంలో తప్పు లేదని కొందరు అంటుంటే.. అమ్మో అంతిచ్చారా అంటూ మిగతావాళ్లు ఆశ్చర్యపోతున్నారు. పదిహేను నిమిషాల నిడివి మాత్రమే ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సీత పాత్రకి ఆలియా ఐదు కోట్లు తీసుకుందనే టాక్ కూడా ఆమధ్య వినిపించింది. అలా చూసుకుంటే ‘గంగాబాయ్’కి ఇరవై కోట్లు పెద్ద విషయమేమీ కాదు మరి.
This post was last modified on January 11, 2022 7:39 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…