విక్రమ్ వేద.. గత దశాబ్ద కాలంలో ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో కచ్చితంగా ఒకటనదగ్గ చిత్రమిది. సరికొత్త స్క్రీన్ ప్లేతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా సాగే ఈ థ్రిల్లర్ మూవీలో మాధవన్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు పోషించారు. ఒక గ్యాంగ్‌స్టర్, ఒక పోలీస్ మధ్య సాగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా ఈ సినిమా నడుస్తుంది. ఇందులో ఊహించని ట్విస్టులుంటాయి. కథను చెప్పే విధానంలో కొత్తదనం కనిపిస్తుంది.
ముఖ్యంగా విజయ్ సేతుపతి చేసిన గ్యాంగ్‌స్టర్ పాత్ర అద్భుతం. సినిమా చూశాక కొన్నాళ్ల పాటు వెంటాడుతుందా పాత్ర. భార్యాభర్తలైన పుష్కర్-గాయత్రి ఈ సినిమాను రూపొందించడం విశేషం. హాలీవుడ్ స్థాయిలో కనిపించే ఈ థ్రిల్లర్ మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. హీరోలుగా రకరకాల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఏమైందో ఏమో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఐతే కొన్నేళ్లుగా సౌత్ సినిమాలపై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్న బాలీవుడ్ వాళ్లు మాత్రం ‘విక్రమ్ వేద’ను వదిలిపెట్టలేదు.
ఓ మోస్తరు హిట్టయ్యే సినిమాలే విడిచిపెట్టని వాళ్లు.. ఇంత పెద్ద హిట్‌ను ఎలా వదిలేస్తారు? హృతిక్ రోషన్-సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ తెరకెకక్కుతోంది. పుష్కర్-గాయత్రిలే అక్కడా డైరెక్ట్ చేస్తున్నారు. హృతిక్ చేస్తున్నది విజయ్ సేతుపతి పాత్ర కావడం సినిమాపై ఆసక్తిని ఇంకా పెంచుతోంది. అతడి స్టార్ ఇమేజ్ కూడా తోడైతే ఈ పాత్ర ఇంకా బాగా పండుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రోజు రిలీజ్ చేసిన హృతిక్ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచింది.
హిందీలో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడం గ్యారెంటీ అని ముందే అందరూ ఫిక్సయిపోయి ఉన్నారు. ఐతే కొత్తగా ఉంటూనే మాస్ ఎలివేషన్లకు స్కోప్ ఉన్న ఈ సినిమాను టాలీవుడ్ వదిలేయడమే ఆశ్చర్యం కలిగించే విషయం. విశేషం ఏంటంటే.. ఈ సినిమా సుకుమార్‌కు చాలా నచ్చేసి ఎవరైనా రీమేక్ ప్రపోజల్‌తో వస్తే డైరెక్ట్ చేద్దామని అనుకున్నాడట. మరి ఆయనే ఎవరైనా స్టార్ హీరోలను అప్రోచ్ కావాల్సింది. ఆయన దర్శకత్వంలో టాప్ స్టార్లు ఎవరైనా ఇందులో నటించి ఉంటే సినిమా మామూలుగా ఉండేది కాదేమో.
This post was last modified on January 10, 2022 5:32 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…