‘మహానటి’తో జాతీయ అవార్డు గెలిచిన కీర్తి సురేష్.. దాని తర్వాత నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘పెంగ్విన్’. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణంలో ఈశ్వర్ కార్తీక్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది. ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో ఈ నెల 19న విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ‘పెంగ్విన్’ టీజర్ రిలీజ్ చేశారు. అందులో కాన్సెప్ట్ ఏంటో చెప్పకుండా ఇది ఒక బిడ్డ కోసం తల్లి చేసే పోరాటం నేపథ్యంలో సాగే సినిమా అన్న సంకేతం ఇచ్చారు. ఈ రోజు ట్రైలర్‌తో సినిమాపై పూర్తి స్పష్టత ఇచ్చారు. గురువారం ‘పెంగ్విన్’ తెలుగు ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేయగా.. తమిళంలో ధనుష్, మలయాళంలో మోహన్ లాల్ ట్రైలర్లు లాంచ్ చేశారు.
ఇక ట్రైలర్ విశేషాల్లోకి వెళ్తే.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన చిన్నారి కొడుకు ఉన్నట్లుండి కనిపించకుండా పోతే.. అతడి కోసం తల్లి ఎలా తపిస్తుంది.. దట్టమైన అడవిలో తన కొడుక్కి సంబంధించిన వస్తువులు కనిపించి అతను చనిపోయాడనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు ఈ కేసులో చేతులెత్తేస్తే.. ఒంటరిగా కొడుకు కోసం ఆ తల్లి ఎలా పోరాడింది అన్న నేపథ్యంలో సినిమా సాగుతుంది. చిన్న పిల్లల్ని తీసుకెళ్లి తీవ్రంగా హింసించి చంపే ఒక సైకో కిల్లర్ చేతుల్లో తన కొడుకు ఉన్నాడని కనిపెట్టిన కథానాయిక.. ఎవరి సాయం లేకుండా ఆ కిల్లర్‌తో ఎలా ఫైట్ చేసింది.. చివరికి కొడుకును దక్కించుకుందా లేదా అన్నది ఈ నెల 19నే తెలుసుకోవాలి.
ఇలాంటి సైకో కిల్లర్ కథలు చాలానే వచ్చినప్పటికీ.. కథనం ఉత్కంఠభరితంగా సాగేలా కనిపిస్తోంది. ట్రైలర్లో కొన్ని దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. మామూలుగా సైకో కిల్లర్లంటే అమ్మాయిల్ని, పెద్ద వాళ్లను తీసుకెళ్లి చంపుతుంటారు. కానీ చిన్న పిల్లల్ని తీసుకెళ్లి హింసించడం అన్నది కొత్త పాయింట్. దీని వెనుక ఏం కారణం ఉంటుందన్నది ఆసక్తికరం. టీజర్ లాగే ‘పెంగ్విన్’ ట్రైలర్ కూడా థ్రిల్లింగ్‌గానే ఉండి సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరి ఈ సినిమా ఏ మేర అంచనాల్ని అందుకుంటుందో చూడాలి.
This post was last modified on June 11, 2020 1:51 pm
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…