Movie News

పుష్ప.. నెగిటివ్ టాక్ మాయం

గత నెల 17వ తేదీన ‘పుష్ప’ సినిమా రిలీజైనపుడు సోషల్ మీడియాలో కనిపించిన నెగెటివిటీకి అందరూ షాకైపోయారు. సినిమాలో  కొన్ని లోపాలున్నప్పటికీ ఆ స్థాయి నెగెటివిటీ ఊహించనిదే. ఇదొక పనికి రాని సినిమా అన్నట్లుగా అదే పనిగా వ్యతిరేక ప్రచారం చేసింది ఓ వర్గం. న్యూట్రల్ ఆడియన్స్‌లోనూ ఈ సినిమా పట్ల కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో కనిపించిన నెగెటివిటీ మాత్రం చాలా ఎక్కువ.

ఇంత కష్టపడి సినిమా తీస్తే ఈ నెగెటివిటీ ఏంటి అని దర్శకుడు సుకుమార్ సన్నిహితుల దగ్గర వాపోయినట్లు సమాచారం. సినిమాకు వచ్చిన సమీక్షల విషయంలోనూ ఆయన బాధ పడ్డారట. ఐతే తన సినిమాలక మొదట్లో డివైడ్ టాక్ రావడం కామనే అని.. వాటిలో చాలా చిత్రాలు ఈ టాక్‌ను తట్టుకుని విజయవంతం అయ్యాయని కూడా ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. చివరికి ఆయన నమ్మకమే నిలబడింది. బాక్సాఫీస్ దగ్గర ‘పుష్ప’ సక్సెస్ ఫుల్ సినిమాగా నిలబడింది. 

టికెట్ల ధరలు తక్కువగా ఉండటం వల్ల ఏపీలో కొంత మేర నష్టాలొచ్చాయి కానీ.. మిగతా అన్ని చోట్లా సినిమా సూపర్ హిట్‌గా నిలబడింది. దీనికి బాక్సాఫీస్ దగ్గర భలేగా కలిసొచ్చి లాంగ్ రన్‌తో భారీ షేర్ రాబట్టగలిగింది. సోషల్ మీడియాలో నెగెటివిటీ కూడా నెమ్మదిగా తగ్గిపోయింది. సినిమా నెగెటివిటీని తట్టుకుని నిలబడేసరికి అందరూ సైలెంటైపోయారు. హిందీ, తమిళం, మలయాళంలో ఈ సినిమా సాధించిన వసూళ్లు చూసి అంతా షాకయ్యారు. ఇతర భాషల నుంచి అంత అప్లాజ్ వస్తుంటే.. మనవాళ్లు ఇంకెక్కడ నెగెటివిటీ స్ప్రెడ్ చేయగలరు.

నెమ్మదిగా ‘పుష్ఫ’ మీదున్న నెగెటివిటీ అంతా పక్కకు పోయి ప్రశంసలే కురవడం మొదలైంది. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీలో వచ్చాక అందరూ ఓ రేంజిలో ఎలివేషన్లు ఇస్తున్నారు. ఈ సినిమా గురించి మొదట్లో వచ్చిన నెగెటివ్ టాక్, కామెంట్లకు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు యునానమస్‌గా సినిమా సూపర్ అనే అభిప్రాయం ఓటీటీలో సినిమా చూసిన వారి నుంచి వ్యక్తమవుతుండటం విశేషం.

This post was last modified on January 9, 2022 9:02 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

7 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

7 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

8 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

9 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

9 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

11 hours ago