అప్పటివరకు ప్రభాస్ అంటే కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. టాలీవుడ్ లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉండేది. అయితే ‘బాహుబలి’ సినిమా ఎప్పుడైతే విడుదలైందో అతడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇంటర్నేషనల్ వైడ్ గా అతడికి ఉన్న పాపులారిటీ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. తెలుగులో ఆయన నటించిన ‘సాహో’ సినిమా ఏవరేజ్ గా ఆడినా.. ఉత్తరాదిన మాత్రం భారీ వసూళ్లను రాబట్టింది.
‘రాధేశ్యామ్’ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. తన రేంజ్ కి తగ్గట్లే ప్రభాస్ కూడా రెమ్యునరేషన్ బాగా పెంచేశారు. ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవాలని చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రభాస్ కి కమర్షియల్ యాడ్స్ లో నటించే ఆఫర్లు వచ్చాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలు వందల కోట్లు ఆఫర్ చేశాయి.
కానీ ప్రభాస్ మాత్రం ఒప్పుకోలేదట. ఈ నెల రోజుల గ్యాప్ లో ఆయన ఏకంగా వంద కోట్ల ఆఫర్ ని కాదన్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సాధారణంగా మన హీరో, హీరోయిన్లు తమ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. వారికొచ్చిన ఏ ఆఫర్ ను మిస్ చేసుకోరు. యాడ్స్ కోసం పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు కాబట్టి వెంటనే ఒప్పుకుంటారు.
వీలైనన్ని ఎక్కువ బ్రాండ్స్ తన
ఖాతాల్లో వేసుకుంటూ ఉంటారు. కానీ ప్రభాస్ మాత్రం వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. బడా కంపెనీలకు సైతం నో అని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది. దాదాపు నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఏడాదిలో ప్రభాస్ నుంచి రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.