Movie News

కార్తి రూటే సెపరేటు

పరుగెత్తి పాలు తాగాలనుకునేవాళ్లే ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తుంటారు. నిలబడి నీళ్లు తాగుదామనుకునేవారు కొందరే ఉంటారు. కార్తి రెండో కేటగిరీకి చెందినవాడు. ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు చేసేద్దాం అనే తాపత్రయం కంటే, ఏం చేసినా కాస్త డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనే యాటిట్యూడ్ ఎక్కువగా కనిపిస్తుంది తనలో. అదే తనని స్పెషల్‌గా నిలబెడుతోంది.       

ప్రస్తుతం కార్తి చేస్తున్న సినిమాలను గమనిస్తే తన రూట్ ఎంత సెపరేట్‌ అనేది అర్థమవుతుంది. సూపర్‌‌ హిట్‌ మూవీ ‘ఖైదీ’కి సీక్వెల్ చేస్తున్నాడు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్‌’లో చోళ రాజు పాత్రలో నటిస్తున్నాడు. ‘విరుమాన్‌’ మూవీలో యాక్షన్‌ హీరోగా కనిపించనున్నాడు. ఇక ‘సర్దార్‌‌’ మరింత డిఫరెంట్. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు కార్తి. ఒకటి యంగ్ పాత్ర. రెండోది వయసు మీదపడిన క్యారెక్టర్.

రెండు రోల్స్‌ కోసం రెండు విధాలుగా మేకోవర్ అయ్యాడు కార్తి. ఓల్డేజ్ క్యారెక్టర్‌‌ని ఫస్ట్ లుక్ పోస్టర్‌‌తోనే రివీల్ చేశారు. రీసెంట్‌గా కొన్ని ఫొటోలు కూడా బైటికొచ్చాయి. ఇక లొకేషన్ నుంచి రిలీజ్ చేసిన వీడియోలో హ్యాండ్‌సమ్ యంగ్‌మేన్‌గా కనిపించాడు. ఈ రెండు లుక్స్‌లోనూ వహ్వా అనిపించేలా ఉన్నాడు కార్తి. ఇక తన అన్నయ్య సూర్యతో కలిసి కార్తి ఓ సినిమా చేయనున్నాడనే వార్త చాలాకాలంగా వినిపిస్తోంది. దాన్ని ఈ యేడు నిజం చేయనున్నారని కోలీవుడ్‌ టాక్. మలయాళ సూపర్‌‌ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్‌’ రీమేక్‌లో వీరిద్దరూ నటిస్తారని అన్నారు. ఈ మూవీ ఆల్రెడీ తెలుగులో ‘భీమ్లానాయక్‌’గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి అంతకంటే ముందే తమిళ రీమేక్‌ గురించి చర్చలు మొదలయ్యాయి.      

పవన్ చేస్తున్న పాత్రలో సూర్య, రానా చేస్తున్న పాత్రలో కార్తి కనిపిస్తారని అన్నారు. కానీ కొన్నాళ్ల తర్వాత సూర్య చేయడం లేదని, ఆయన స్థానంలో పార్థిబన్ యాక్ట్ చేస్తాడని ప్రచారం జరిగింది. ఇంతవరకు వీటిలో ఏదీ వర్కవుట్ కాలేదు. అయితే కార్తి, సూర్య మాత్రం కలిసి నటించే ప్లాన్స్‌లోనే ఉన్నారట. రీమేక్ కాకుండా ఓ కొత్త స్క్రిప్ట్‌తో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య రెండు వరుస విజయాలు అందుకున్న జోష్‌లో ఉన్నాడు. ఇక కార్తి వెరైటీనే కోరుకుంటాడు. కాబట్టి కచ్చితంగా ఏదో మంచి ప్రాజెక్టే లైన్‌లో పెట్టే చాన్స్ ఉంది. 

This post was last modified on January 8, 2022 3:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణలో దారుణం.. పట్టపగలే కత్తితో పొడిచి..

తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…

27 minutes ago

రాహుల్ వ‌ర్సెస్ ఖ‌ర్గే.. కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం!

జాతీయ పురాత‌న పార్టీ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌తంగా భారీ క‌ల‌క‌లం రేగిన‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రు కీల‌క నాయకుల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయికి…

46 minutes ago

ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…

1 hour ago

నిత్యమీనన్ ఆ బయోపిక్ ఎందుకు చేయలేదు?

దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…

2 hours ago

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

3 hours ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

3 hours ago