బుధవారం నందమూరి బాలకృష్ణ షష్టి పూర్తి. ఈ ప్రత్యేక సందర్భాన ఆయన కుటుంబ సభ్యుల మధ్య ఘనంగానే వేడుకలు జరుపుకున్నారు. ఐతే సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు కానీ.. అభిమానులు కానీ ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొనే అవకాశం లేకపోయింది. ఇదంతా కరోనా పుణ్యమే. అయితే మామూలు రోజుల్లో అయితే బాలయ్య 60వ జన్మదిన వేడుకలు ఎలా జరిగి ఉండేవన్న ఆలోచనలో ఉన్నారు అభిమానులు.
ఒకవేళ చిరంజీవి 60వ జన్మదినానికి జరిగినట్లే.. శిల్ప కళా వేదిక లాంటి చోట వేడుకలు చేసేవాళ్లా.. ఎవరైనా సినీ జనాలు దానికి హాజరయ్యేవాళ్లా.. బాలయ్య ఫిలిం ఇండస్ట్రీకి పార్టీ ఏమైనా ఇచ్చేవాడా.. దానికి ఎవరెవరు హాజరయ్యేవారు అన్న ఊహల్లో అభిమానులు ఉన్నారు.
ఐతే ఇదే ఊహతో ఓ అభిమాని.. వావ్ ఒక ఆర్ట్ తయారు చేశాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య 60వ పుట్టిన రోజు వేడుకల్ని టాలీవుడ్ స్టార్ హీరోలందరూ కలిసి దగ్గరుండి జరిపిస్తన్నట్లుగా ఉంది ఆ ఆర్ట్. సోఫాలో బాలయ్య పక్కనే చిరు కూర్చుని కేక్ కట్ చేయించే పనిలో ఉండగా.. వారి ముందు నాగ్, వెంకీ కుర్చీల్లో కూర్చుని నవ్వులు చిందిస్తున్నారు.
ఇటు, అటు పక్కన, ముందు, వెనుక మిగతా స్టార్లున్నట్లుగా దీన్ని తీర్చిదిద్దారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, రానా, నాని, శర్వానంద్, నాగచైతన్య, మంచు మనోజ్, రామ్, నితిన్.. ఇలా దాదాపు అందరు టాలీవుడ్ స్టార్లనూ ఇందులో కవర్ చేశారు.
వంటలో మంచి నైపుణ్యం ఉన్న ఎన్టీఆర్ వెనుక గరిట తిప్పుతుంటే రామ్ అతడికి సాయం చేస్తున్నట్లు.. చరణ్ ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నట్లు చూపించడం విశేషం. ఈ ఆర్ట్ చూసి నిజంగా టాలీవుడ్ అంతా కలిసి బాలయ్య షష్టిపూర్తి వేడుకలు జరిపిస్తే ఎంత బావుణ్నో అనుకుంటున్నారు సినీ అభిమానులు.
This post was last modified on June 10, 2020 11:12 pm
ఏపీలో రాజకీయం నానాటికీ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ ఖాళీ అయిపోతూ ఉంటే… రికార్డు విక్టరీ కొట్టిన…
2025 తొలి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ నమోదు చేసే దిశగా పరుగులు పెడుతున్న సంక్రాంతికి వస్తున్నాం పది రోజులకే 230…
భారీ అంచనాలతో రామ్ చరణ్ మూడేళ్లు వెచ్చించిన గేమ్ ఛేంజర్ విడుదల రోజు నుంచి ఎన్ని ఇక్కట్లు పడుతోందో చూస్తూనే…
కొత్త చట్టాల్ని చేసినప్పుడు.. వాటికి సంబంధించిన ప్రచారం పెద్ద ఎత్తున జరగాలి. అదేం లేకుండా.. చట్టం చేశాం.. మీకు తెలీదా?…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తాజా విదేశీ పర్యటన నిజంగానే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు.…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇంటిలోకి చొరబడ్డ ఆ దొంగ ఏం తీసుకెళ్లలేకపోయాడు గానీ… అతడి కత్తి మాత్రం…