‘పుష్ప’ సినిమా థియేటర్లలో ఇంకా బాగా ఆడుతుండగానే ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబరు 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. సరిగ్గా 20 రోజుల తర్వాత అమేజాన్ ప్రైమ్ ద్వారా డిజిటల్‌లో రిలీజైంది. ఈపాటికి ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్లలోకి దిగి ఉంటుంది కాబట్టి.. ‘పుష్ప’ థియేట్రికల్ రన్ ముగిసిపోతుందన్న ఉద్దేశంతో ముందే ఈ మేరకు ఒప్పందం చేసుకుంది నిర్మాణ సంస్థ. తీరా చూస్తే ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిపోయి ‘పుష్ప’ ఇంకా థియేటర్లలో బాగా ఆడుతుండగానే ఈ సినిమా ప్రైమ్‌లోకి వచ్చేసింది.
కాకపోతే హిందీ వెర్షన్ మంచి షేర్ రాబడుతుండటంతో దాని వరకు ఎలాగోలా ఆపగలిగారు. ఆ వెర్షన్ ప్రైమ్‌లోకి రాలేదు. ఇక ‘పుష్ప’ను థియేటర్లలో చూడలేకపోయిన వాళ్లు.. అలాగే థియేటర్లలో చూసి ఇంకోసారి ఎంజాయ్ చేద్దామనుకున్న వాళ్లు ఎగబడి సినిమాను చూస్తున్నట్లే కనిపిస్తోంది. ‘పుష్ప’ రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియా ఎక్కడ చూసినా దీని గురించే చర్చ.
థియేటర్లలో ‘పుష్ప’ సినిమా చూసిన వాళ్లకు ఎక్స్‌ట్రా కిక్కు ఇచ్చేలా ఓటీటీ వెర్షన్ ఉండటం విశేషం. ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సమంత పాట ‘ఊ అంటావా ఊహూ అంటావా’ లెంగ్త్ కాస్త పెంచారు. సమంత హాట్ పోజులు, స్టెప్పులు ఇంకొన్ని జోడించడం విశేషం. సినిమాలో ఈ పాట హడావుడిగా అయిపోయినట్లు అనిపిస్తుంది. సమంత హాట్ స్టెప్పులను తనివి తీరా ఆస్వాదించలేకపోయామే అనుకున్న వాళ్లకు.. ఓటీటీ వెర్షన్ల్ సాంగ్ పూర్తి సంతృప్తినిస్తోంది. థియేటర్లలో ముందుగా ఈ సినిమా రిలీజైనపుడు డిజిటల్ ఇంటర్మీడియట్ కూడా సరిగా చేయకపోవడంతో ఈ పాట కొంచెం మసక మసకగా కూడా అనిపించిన మాట వాస్తవం.
ఐతే ఓటీటీ వెర్షన్లో ఆ లోటు కనిపించడం లేదు. బెటర్ వెర్షనే రిలీజ్ చేసినట్లున్నారు. ఓవరాల్‌గా సినిమా ఇంపాక్ట్ వేరుగా ఉంది. ఇంకోవైపు ఓటీటీ వెర్షన్లో ఒక కీలక సన్నివేశాన్ని కూడా జోడించారు. సినిమా ఆరంభంలో హీరో పాత్రను ఎలివేట్ చేసే సన్నివేశం అది. మిల్లులో పని మానేసి వచ్చేశాక ఊర్లో ఒక వ్యక్తి పుష్ప తల్లి చేసిన అప్పు తీర్చలేదని నానా మాటలు అనడం, పుష్ప తమ ఆవును అమ్మి ఆ అప్పు తీర్చేసి.. తన తల్లిని ఎవరి ముందైతే అవమానించాడో వాళ్లందరి ఇళ్ల ముందుకు తీసుకెళ్లి ఆ వ్యక్తిని కొడుతూ అప్పు తీర్చేసినట్లు చెప్పిస్తాడీ సన్నివేశంలో. మంచి ఎలివేషన్ ఉన్న ఈ సన్నివేశాన్ని సినిమా నుంచి ఎందుకు తీసేశారో అనిపిస్తోంది. బహుశా లెంగ్త్ ఎక్కువైందని దీన్ని పక్కన పెట్టారేమో.
This post was last modified on January 8, 2022 12:22 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…