సంక్రాంతి సందడి గురించి ఏదో ఊహించుకుంటే ఇంకేదో జరిగింది. ముందేమో సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ మధ్య సంక్రాంతి పోరు సంకేతాలు కనిపించాయి. ఆ తర్వాత అవి రేసు నుంచి తప్పుకుని ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ బరిలో నిలిచాయి. చివరికి చూస్తే అవి కూడా వాయిదా పడిపోయి.. బంగార్రాజు లాంటి మీడియం రేంజ్ మూవీ.. రౌడీ బాయ్స్, డీజే టిల్లు, హీరో లాంటి చిన్న సినిమాలు రేసులో మిగిలాయి.
ప్రస్తుతానికి సంక్రాంతికి పక్కాగా వస్తాయనుకుంటున్న సినిమాలు ఇవే. ఐతే ఈ సినిమాలకు రిలీజ్ డేట్లు ఖరారు చేశారు. ప్రమోషన్లు కూడా చేస్తున్నారు కానీ.. తీరా సంక్రాంతి టైంకి ఇవి విడుదలవుతాయో లేదో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆయా చిత్ర బృందాల్లో కూడా ఈ విషయంలో కాన్ఫిడెన్స్ లేనట్లు కనిపిస్తోంది. ఈ సినిమాల్లో వేటికీ పూర్తి స్థాయిలో థియేటర్లు ఖరారవ్వలేదు.
యుఎస్‌లో ప్రిమియర్స్ సంగతి కూడా తేలలేదు. అక్కడ ఈపాటికే స్క్ర్రీన్లు ఖరారై, బుకింగ్స్ కూడా ఓపెన్ కావాలి.కానీ కరోనా కారణంగా తలెత్తిన అనిశ్చితి వల్ల చివరి వరకు టెన్షన్ తప్పేలా లేదు. దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. రోజు వారీ కేసులు మల్టిప్లై అవుతున్నాయి. రోజు వారీ కేసుల సంఖ్య అప్పుడే మళ్లీ లక్ష మార్కును టచ్ చేసేసింది. ఇంకో వారానికి ఈ సంఖ్య 2-3 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. పండుగ సమయంలో ప్రయాణాలు, వేడుకలకు తోడు సినిమా థియేటర్లలో ప్రేక్షకులను కూడా పూర్తి స్థాయిలో అనుమతిస్తే.. సంక్రాంతి సీజన్ అయ్యేసరికి కరోనా ఉద్ధృతి పతాక స్థాయికి చేరుకోవచ్చనే ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో పండుగ టైంకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లపై ఆంక్షలు పెడతారేమో, ఆక్యుపెన్సీ 50 శాతానికి పడిపోతుందేమో.. ఏపీలో నైట్ కర్ఫ్యూ వస్తుందేమో, సెకండ్ షోలు రద్దవుతాయేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా థియేటర్లు మూతపడ్డా ఆశ్చర్యం లేకపోవచ్చు. వేగంగా పరిస్థితులు మారిపోతున్న వారం తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే సంక్రాంతి సినిమాలు అనుకున్న ప్రకారం సంక్రాంతికి సందడి చేస్తాయన్న గ్యారెంటీ లేదు.
This post was last modified on January 7, 2022 10:05 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…