కొన్నేళ్లుగా తన అన్న కొడుకు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నందమూరి బాలకృష్ణ స్పందిస్తున్న తీరే చిత్రంగా ఉంటోంది. హరికృష్ణ చనిపోయినపుడు మినహాయిస్తే తారక్‌తో బాలయ్య సన్నిహితంగా కనిపించింది లేదు. అతడి ప్రస్తావన వచ్చినపుడు కూడా తేలిగ్గా మాట్లాడుతుంటాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తారక్ రాజకీయ అరంగేట్రం గురించి అడిగితే.. ఎవరిష్టం వాళ్లది సమాధానం దాటవేశాడు బాలయ్య. ఇప్పుడు తారక్ పట్ల బాలయ్య ఉద్దేశాలపై సందేహాలు రేకెత్తించేలా మాట్లాడాడు బాలయ్య.
తన కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి అడిగితే బాలయ్య ఆసక్తికర రీతిలో స్పందించారు. మోక్షజ్ఞ తప్పకుండా సినిమాల్లోకి వస్తాడని అన్న బాలయ్య సరైన సమయం, సందర్భం చూసి అతను అరంగేట్రం చేస్తాడన్నారు. అతను సినిమాల్లో కచ్చితంగా రాణిస్తాడని కూడా ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బాలయ్య ఓ మాటను నొక్కి నొక్కి చెప్పారు. నందమూరి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మోక్షజ్ఞదే అన్నాడు. ఐతే తన తర్వాతి తరంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇప్పటికే నందమూరి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని బాలయ్య ఎందుకు గుర్తించడం లేదన్నది ప్రశ్న. కళ్యాణ్ రామ్ సంగతి పక్కన పెట్టేసినా తారక్ సూపర్ స్టార్ రేంజ్ అందుకుని నందమూరి లెగసీని నిలబెడుతున్నాడు.
అసలు బాలయ్య వరుస డిజాస్టర్లతో పూర్తిగా ప్రభ కోల్పోయిన సమయంలో నందమూరి లెగసీని కాపాడింది తారకే. బాలయ్య స్లంప్‌లో ఉండగా నందమూరి అభిమానులు డీలా పడిపోకుండా వారికి ఎనర్జీని నింపింది తారక్. అతను బాలయ్యను మించి ఎదిగాడు. బాలయ్య తర్వాతి తరంలో నందమూరి వంశానికి టార్చ్ బేరర్‌గా ఉన్నాడు. మరి బాలయ్య అతణ్ని గుర్తించకుండా తన కొడుకుదే నందమూరి నట వారసత్వాన్ని కొనసాగించే బాధ్యత అనడం ఆశ్చర్యం.
This post was last modified on June 10, 2020 5:49 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…