బాలయ్య కోసం మహేష్ బాబు.. ఇంకా ఎందరో

నందమూరి బాలకృష్ణ జీవితంలో ప్రత్యేకమైన పుట్టిన రోజును జరుపుకుంటున్నారీ రోజు. ఆయనకు 2020 జూన్ 10తో షష్టిపూర్తి పూర్తవుతోంది. కరోనా-లాక్ డౌన్ లేకుంటే బయట సంబరాలు ఓ రేంజిలో ఉండేవే. కానీ అనివార్య పరిస్థితుల్లో బయట పెద్దగా సందడి లేదు. బాలయ్య తాను ఛైర్మన్‌గా ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో సింపుల్‌గా వేడుకలు జరుపుకున్నారు.

అచ్చమైన తెలుగువాడిలా సంప్రదాయ దుస్తుల్లో తయారై వెళ్లిన ఆయన పేషెంట్ల మధ్య జన్మదిన వేడుకలు చేసుకున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో బాలయ్యకు పెద్ద ఎత్తున సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలిపారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇంకా చాలామందే ఉన్నారు.
వాళ్లలో ఎవరు ఏమన్నారో చూద్దాం పదండి.

60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను.Dear #NBK as U turn the magical 60,I fondly reminisce on Ur amazing journey.Happy birthday
-చిరంజీవి

నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! #HappyBirthdayNBK
-జూనియర్ ఎన్టీఆర్

To the powerhouse of energy, an actor I’ve always admired… Happy 60th Balakrishna garu. Wishing you the best of health and happiness always
-మహేష్ బాబు

నా సోదరుని కుమారుడు, నందమూరి బాలకృష్ణ 100 సంవత్సరాలు అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యములతో నిండు నూరేళ్ళు పుట్టిన రోజులు జరుపుకోవాలని నా హృదయపూర్వకముగా షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను
-మోహన్‌బాబు

బాల మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు.. కోకో కోలా పెప్సీ.. బాలయ్యబాబు సెక్సీ
-పూరీ జగన్నాథ్

మీరు ఎందరికో బాలయ్య.. నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను. మీ స్ఫూర్తితోనే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను
-నందమూరి కల్యాణ్‌రామ్

‘‘అందరికీ ఆయన బాలయ్య. నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు ఆయన. బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే షష్టిపూర్తి మహోత్సవ అభినందనలు. నిన్న బాలా మావయ్య కొత్త సినిమా టీజర్ చూసాను. చాలా ఎనర్జిటిక్‌గా కనిపించారు. మావయ్యా… మీరు మరెన్నో చిత్రాల్లో నటించి… మీ అభిమానులకు ఎప్పటిలాగే సంచలన విజయాలను కానుకగా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను’’-నారా లోకేష్

60వ వసంతంలోకి అడుగుపెడుతున్న బాలయ్యబాబు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి ఘనమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్‌డే బాలయ్య
-డైరెక్టర్ క్రిష్

బాలకృష్ణగారికి 60వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఇంతే ఉత్సాహంతో వెండితెరపై మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నా
-సాయిధరమ్ తేజ్

బాలయ్యబాబుకు జన్మదిన శుభాకాంక్షలు.. ఒళ్లు గగుర్పొడిచే పెర్ఫార్మెన్స్‌లతో అలరిస్తున్న బాలయ్యబాబుకు ధన్యవాదాలు
-హరీష్ శంకర్

మా బాలయ్యబాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు -సుధీర్ బాబు