‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇటీవలే ‘ఖిలాడీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఈ హీరో ప్రస్తుతం శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి రెడీ అవుతున్నారు. అదే ‘రావణాసుర’. దర్శకుడు సుధీర్ వర్మ రూపొందించనున్న ఈ సినిమాను జనవరి 14న గ్రాండ్ గా లాంఛ్ చేయనున్నారు.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కథ ప్రకారం సినిమాలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. అలానే విలన్ గా కూడా ఓ హీరోయిన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. దక్ష నగర్కార్. ‘హోరా హోరీ’, ‘హుషారు’ వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ రీసెంట్ గా ‘జాంబీరెడ్డి’ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించింది.
ఇప్పుడేమో రవితేజ సినిమాలో లేడీ విలన్ గా ఆమెను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించడానికి దక్ష చాలా ఎగ్జైటెడ్ గా ఉందట. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించనున్నారు. అయితే మెయిన్ విలన్ గా మరొకరిని తీసుకున్నట్లు తెలుస్తోంది.
కానీ దక్ష రోల్ మాత్రం హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో రవితేజ లాయర్ గా కనిపించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. అభిషేక్ పిక్చర్స్, RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను విడుదల చేయగా.. అందులో హీరో పది తలలున్న రావణుడిగా కనిపించారు.
This post was last modified on January 5, 2022 7:02 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…