Movie News

హీరోగా మ్యూజిక్ సెన్సేషన్

సంగీత దర్శకులు హీరోలుగా మారడం అరుదుగానే జరుగుతుంటుంది. వాళ్లలో సక్సెస్ అయిన వాళ్లు కూడా కొద్దిమందే. బాలీవుడ్లో హిమేష్ రేషమ్మియా హీరోగా చేసి ఎక్కువ కాలం నిలబడలేక వెనక్కి తగ్గాడు. సరైన సమయంలో సంగీతాన్ని పక్కన పెట్టడంతో అతను తనకు నప్పే రంగంలోనూ ఫెయిలయ్యాడు. తెలుగులో దేవిశ్రీ ప్రసాద్ తెరంగేట్రం గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. కానీ దేవి నిజంగా హీరో అవుతాడా అన్నది సందేహంగానే ఉంది.

తమిళం విషయానికి వస్తే.. రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాష్ కుమార్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. సంగీత దర్శకుడిగా ఒక స్థాయి అందుకోగానే అతను హీరో అయ్యాడు. ఇప్పటికే పది సినిమాల దాకా చేశాడు. ఇప్పుడు కూడా వరుసబెట్టి సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ఇప్పుడు కోలీవుడ్ నుంచే మరో మ్యూజిక్ సెన్సేషన్ హీరో కాబోతున్నట్లు సమాచారం. అతనెవరో కాదు.. అనిరుధ్ రవిచందర్.

18 ఏళ్ల వయసులోనే సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసి, తొలి సినిమాలోనే ‘కొలవెరి’ పాటతో వెర్రెత్తించిన అనిరుధ్.. చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. విజయ్, రజనీకాంత్, అజిత్.. ఇలా చాలామంది సూపర్ స్టార్ల సినిమాలకు సంగీతం అందించాడు. ఇప్పుడు తమిళంలో అతనే నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అతిశయోక్తి లేదు.

కేవలం సినిమాలతోనే కాక మ్యూజికల్ కన్సర్ట్‌లతో యూత్‌లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అనిరుధ్. అతణ్ని హీరోగా చేయడానికి తన క్లోజ్ ఫ్రెండ్, స్టార్ హీరో శివకార్తికేయన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. తన ‘ఎస్కే ఫిలిమ్స్’ బేనర్ మీద అతణ్ని హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీయనున్నాడట. ఈ చిత్రానికి స్క్రిప్టు కూడా రెడీ అయిందట.

ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తాడట. సంగీత ప్రధానంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అజ్ఞాతవాసి, జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలతో అనిరుధ్ తెలుగు వాళ్లకు కూడా బాగానే పరిచయం. కాబట్టి హీరోగా అతడి సినిమా తెరకెక్కితే ఇక్కడికి కూడా వచ్చే అవకాశముంది.

This post was last modified on June 10, 2020 9:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago