మలయాళంలో వచ్చిన ‘నాయట్టు’ అనే సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముగ్గురు పోలీసుల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంది గీతాఆర్ట్స్ సంస్థ. దీంతో వెంటనే రీమేక్ రైట్స్ కొనేసి.. దర్శకుడిగా కరుణ కుమార్ ను రంగంలోకి దించారు. ఆయన డైరెక్ట్ చేసిన ‘పలాస’ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ఈ రీమేక్ ను కూడా నేటివ్ టచ్ తో డీల్ చేస్తారని దర్శకత్వ బాధత్యలు అప్పగించారు. సినిమా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక షూటింగ్ మొదలవ్వడమే ఆలస్యమనుకుంటున్న సమయంలో ఈ సినిమాకి బ్రేకులు పడ్డాయి. దానికి కారణం ఏంటనేది మాత్రం బయటకు రాలేదు. కరుణ కుమార్ వేరే బ్యానర్ లో మరో సినిమా చేయాలని చూస్తున్నారు.
సడెన్ గా ఈ రీమేక్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటని ఆరా తీయగా.. సినిమా బడ్జెట్ సమస్యలే కారణమని తెలుస్తోంది. ఈ సినిమాను రూ.4 కోట్లలో తీయాలని దర్శకుడు కరుణకుమార్ కు చెప్పారు. కానీ బడ్జెట్ లెక్కలు వేసుకున్నప్పుడు రూ.8 కోట్లు వచ్చిందట. దర్శకుడు రూ.1.25 కోట్ల ప్యాకేజీ అడిగారని సమాచారం. నటుడు రావు రమేష్ కి రూ.కోటి రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వచ్చిందట.
రూ.8 కోట్లలో సినిమా తీస్తే వర్కవుట్ అవుతుందా..? లేదా..? అనే సందేహాలు నిర్మాతల్లో కలిగాయి. అందుకే సినిమాను ఆరంభంలోనే ఆపేశారు. ఇప్పుడు ‘నాయట్టు’ డబ్బింగ్ రైట్స్ కూడా గీతాఆర్ట్స్ దగ్గరే ఉండడంతో.. ఇప్పుడు సినిమాను తెలుగులో డబ్ చేసి ‘ఆహా’లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారట. దర్శకుడు కరుణకుమార్ కి ఆల్రెడీ అడ్వాన్స్ ఇవ్వడంతో.. ఆయనతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి!
This post was last modified on January 3, 2022 10:00 pm
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…