ఈ సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయనుకుంటే.. ఇప్పుడు ఒక్కో సినిమా వాయిదా పడుతుంది. ఇప్పటికే రాజమౌళి అండ్ కో.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను వాయిదా వేసినట్లు అనౌన్స్ చేశారు. ఢిల్లీ, ముంబై లాంటి సిటీల్లో కర్ఫ్యూలు విధించడం, తమిళనాడు రాష్ట్రంలో థియేటర్ అక్యుపెన్సీ యాభై శాతం పెట్టడం, ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ ఇలా పలు కారణాల వలన ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడింది.
ఇప్పుడు ‘రాధేశ్యామ్’ సినిమా కూడా ‘ఆర్ఆర్ఆర్’ను ఫాలో అవ్వబోతుందని సమాచారం. ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాను జనవరి 14న విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయకపోవడమే మంచిదని భావిస్తున్నారు మేకర్స్. ‘రాధేశ్యామ్’కి నార్త్ ఇండియన్ మార్కెట్ చాలా కీలకం.
కానీ ఇప్పుడు ఉత్తరాదిన పార్షియల్ లాక్ డౌన్ పెట్టేశారు. అందుకే ప్రభాస్ సినిమాను కూడా వాయిదా వేయాలని చూస్తున్నారు. దానికి తగ్గట్లే చిత్రబృందం ప్రమోషన్స్ ను ఆపేసింది. ప్రభాస్ కూడా షెడ్యూల్ చేసిన మీడియా ఇంటర్వ్యూలను క్యాన్సిల్ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమా వాయిదా పడిందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ విషయాన్ని ఈ వారంలోనే అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం. రాబోయే నెలల్లో ఏదొక డేట్ ను లాక్ చేయాలని చూస్తుంది ‘రాధేశ్యామ్’ టీమ్. సంక్రాంతికి చూడాలనుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. పోనీ.. ప్రభాస్ సినిమా ఉంది కదా.. అని హ్యాపీ ఫీల్ అవుతున్న అభిమానులకు ఇప్పుడు షాక్ ఇవ్వబోతున్నారు. ‘రాధేశ్యామ్’ కూడా వాయిదా పడితే ఈ సంక్రాంతికి చిన్న సినిమాలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.
This post was last modified on January 3, 2022 2:49 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…