మన సాయిధరమ్ తేజ్ లాగే కోలీవుడ్లో ఒక వారసత్వ హీరో తన తొలి సినిమా విషయంలో విపరీతమైన టెన్షన్ ఎదుర్కొన్నాడు. అతనే.. ధ్రువ్ విక్రమ్. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే పెద్ద స్టార్లలో ఒకడైన విక్రమ్ తనయుడీ కుర్రాడు. తనకు హీరోగా లైఫ్ ఇచ్చిన బాలా దర్శకత్వంలో తన కొడుకును హీరోగా పరిచయం చేయాలన్న విక్రమ్ నిర్ణయం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అర్జున్ రెడ్డి రీమేక్‌ను ఆయన చేతుల్లో పెడితే సినిమా పూర్తయ్యాక దాని ప్రోమోలు చూసి ఒక్కొక్కరు బెంబేలెత్తిపోయారు.
తీవ్ర విమర్శలు రావడంతో ఆ వెర్షన్ మొత్తం డస్ట్ బిన్‌లో పడేసి.. అర్జున్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గిరీశయ్యతో మళ్లీ సినిమా తీయించి ఆదిత్య వర్మ పేరుతో రిలీజ్ చేస్తే అది ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు ధ్రువ్.. తన తండ్రితో కలిసి మహాన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు సినిమాలకు సంబంధించిన విషయంతో కాకుండా వ్యక్తిగత వ్యవహారంతో ధ్రువ్ వార్తల్లోకి వచ్చాడు.
తన తొలి చిత్రం ఆదిత్య వర్మలో కథానాయికగా నటించిన బాలీవుడ్ భామ బానిత సంధుతో అతను ప్రేమలో ఉన్నట్లుగా కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదేమీ ఊరికే వచ్చిన పుకారు కాదు. ఆదిత్య వర్మ విడుదలై రెండేళ్లు దాటిపోగా.. వీళ్లిద్దరూ ఇప్పటికీ చాలా క్లోజ్‌గా కనిపిస్తుండటం.. ఇద్దరూ కలిసి ఫారిన్ టూర్‌కు కూడా వెళ్లడంతో ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని బలంగా వార్తలొస్తున్నాయి.
తాజాగా ధ్రువ్, బానిత కలిసి దుబాయ్‌కి వెళ్లారు. అక్కడే బుర్జ్ ఖలీఫాకు దగ్గర్లో ఒక హోటల్లో ఉండి నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు. హోటల్ గది నుంచి బానిత బుర్జ్ ఖలీఫాను చూస్తున్న వీడియోను ధ్రువ్‌యే స్వయంగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసి ధ్రువ్, బానిత ప్రేమలో ఉన్నట్లే అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. బానిత ఆదిత్య వర్మ తర్వాత తమిళంలో సినిమాలేవీ చేయలేదు. ఇటీవల విక్కీ కౌశల్ మూవీ సర్దార్ ఉద్దమ్‌లో ఆమె కనిపించింది.
This post was last modified on January 3, 2022 11:30 am
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…