మాస్ రాజా రవితేజ కెరీర్లో అస్సలు గుర్తు పెట్టుకోలేని కొన్ని సినిమాలున్నాయి. ఆ సినిమాలను రవితేజ ఎలా ఒప్పుకున్నాడో అర్థం కాదు. అన్ని సినిమాల ఫలితాలనూ అంచనా వేయడం కష్టం, కొన్నిసార్లు మంచి సినిమాలకు కూడా రిజల్ట్ తేడా కొట్టేస్తుంటుంది. కానీ కొన్ని సినిమాల ఫలితం ఏంటో చాలా ముందే తెలిసిపోతుంటుంది. ఆ సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులకు చుక్కలు చూపించేస్తాయి.
ఆరంభం నుంచి చివరి దాకా డిజాస్టర్ ఫీల్స్ ఉంటాయి ఆ చిత్రాలు చూస్తుంటే. మాస్ రాజా కెరీర్లో అలాంటి ఒక సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోని’. తనకు నీకోసం, వెంకీ, దుబాయ్ శీను లాంటి హిట్లు ఇచ్చాడన్న కృతజ్ఞతతోనో ఏమో.. శ్రీను వైట్ల వరుస డిజాస్టర్లతో స్లంప్‌లో ఉన్న టైంలో అతడికి రవితేజ ఛాన్స్ ఇచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ప్రొడక్షన్లో భారీ బడ్జెట్లో ఈ సినిమా తీశారు.
కానీ అది పెద్ద డిజాస్టర్ అయింది.ఆ సినిమా గురించి తాజాగా బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోలో రవితేజ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రవితేజ యుఎస్‌లో ఉన్న ఒక ఫొటోను బాలయ్య ఈ షోలో స్క్రీన్ మీద డిస్‌ప్లే చేసి దాని గురించి చెప్పమని అడిగాడు. అది ఒక సినిమా షూటింగ్ టైంలో తీసిన ఫొటో అంటూ.. ఆ సినిమా గురించి ఊహించని వ్యాఖ్యలు చేశాడు రవితేజ. ‘‘ఈ ఫొటో అమెరికా తీసింది. ఒక కళాఖండం లాంటి సినిమా షూటింగ్ టైంలో. ఆ కళాఖండం పేరు తెలుసుకోవాలనుందా మీకు? అమర్ అక్బర్ ఆంటోని. అది పెద్ద కళాఖండం’’ అన్నాడు రవితేజ.
ఇందులో నువ్వు అమరా, అక్బరా, ఆంటోనీనా అని బాలయ్య అడగ్గా.. ‘‘మూడూ.. ఆ సినిమా చూడలేదా మీరు’’ అన్నాడు రవితేజ. బాలయ్య చూడలేదని చెప్పగా.. ‘‘మీరేం మిస్సయిపోలేదు. చూడక్కర్లా’’ అన్నాడు మాస్ రాజా. రాడ్ రంబోలానా అని బాలయ్య అంటే.. మామూలు రాడ్ కాదు.. రాడ్డుకే రాడ్ అని రవితేజ ముగించాడు. ఎంత డిజాస్టర్ అయినప్పటికీ.. ‘అమర్ అక్బర్ ఆంటోని’ గురించి మాస్ రాజా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. దీన్ని బట్టే ఆ సినిమా ఫలితం మాస్ రాజాను ఎంత డిస్టర్బ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on January 2, 2022 3:22 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…