Movie News

ట్రైలర్ బాగుంది.. కానీ అర్థం కాలా


మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ కొన్నేళ్ల కిందట ‘విజేత’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సినిమా అతడికి నిరాశనే మిగిల్చింది. కంటెంట్ పరంగా యావరేజే అయినా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీని తర్వాత ‘సూపర్ మచ్చి’ అనే మరో సినిమా చేశాడతను. కానీ అది అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. దాని రిలీజ్ సంగతేంటో తేలలేదు. ఐతే ఈ లోపు కళ్యాణ్ మరో సినిమాను మొదలుపెట్టి చకచకా పూర్తి చేశాడు. అదే.. కిన్నెరసాని.

నాగశౌర్య హీరోగా నటించిన ‘అశ్వథ్థామ’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన రమణ తేజ డైరెక్ట్ చేసిన రెండో చిత్రమిది. కళ్యాణ్ సరసన మలయాళ అమ్మాయి శీతల్ నటించింది. మలయాళ హిట్ మూవీ ‘ఇష్క్’తో మంచి పేరు సంపాదించిన శీతల్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్ రవీంద్ర విజయ్ కీలక పాత్ర పోషించాడీ సినిమాలో.

షూటింగ్ పూర్తి చేసుకున్న విడుదలకు సిద్ధమవుతున్న ‘కిన్నెరసాని’ నుంచి తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.ట్రైలర్ ఆద్యంతం ఇంటెన్స్‌గా, ఇంట్రెస్టింగ్‌గానే కనిపించింది. కథాకథనాలు రొటీన్‌కు భిన్నంగా అనిపించాయి. నరేషన్‌లోనూ కొత్తదనం కనిపించింది. విజువల్స్ చాలా బాగున్నాయి. మహతి స్వర సాగర్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. టెక్నికల్‌గా సినిమాకు అన్నీ బాగా కుదిరినట్లున్నాయి. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ కూడా బాగుంది. కళ్యాణ్ దేవ్ తొలి చిత్రంతో పోలిస్తే చాలా బెటర్‌‌గా అనిపించాడు. అతడి లుక్ కూడా ఓకే. కొత్తదనం కోరుకునే వాళ్లు చూడదగ్గ సినిమాలాగే కనిపిస్తోంది ‘కిన్నెరసాని’.

ఐతే ట్రైలర్లో అన్నీ బాగున్నప్పటికీ.. అసలు ఈ సినిమా కథేంటన్నదే అర్థం కావడం లేదు. ట్రైలర్ ఉద్దేశమే కథ గురించి ఎంతో కొంత చెప్పడం, ఎలాంటి సినిమా చూడబోతున్నామో సంకేతాలు ఇవ్వడమే. కానీ ‘కిన్నెరసాని’ ట్రైలర్ రెండు మూడుసార్లు చూసినా కూడా దీని కథేంటన్నది ఐడియా రాని పరిస్థితి. బహుశా థియేటర్లో సర్ప్రైజ్ చేయాలని ఆ గుట్టు విప్పట్లేదేమో. మరి జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంతో అయినా కళ్యాణ్ దేవ్ తొలి విజయాన్నందుకుంటాడేమో చూడాలి.

This post was last modified on December 30, 2021 2:24 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

3 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

4 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

5 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

5 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

7 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

7 hours ago